‘డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు
– రూ.850 కోట్లతో మహేశ్వరంలో ‘జేఎస్‌ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ’
– ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. కొత్తగా 300 మందికి ఉద్యోగాలు
– ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణను డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. అడ్వాన్స్‌డ్‌ అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌, డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్‌ లీడర్‌గా మార్చేలా ఎకోసిస్టంను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. జేఎస్‌డబ్ల్యూ, షీల్డ్‌ ఏఐ సంయుక్తంగా రూ.850 కోట్లతో మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చర్‌ క్లస్టర్‌(ఈఎంసీ)లో ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌(యూఏవీ) ఫెసిలిటీ భూమి పూజకు ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్‌ సిస్టమ్స్‌, ఏఐ అనేవి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయంసమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమన్నారు. 2030 నాటికి దేశీయ డిఫెన్స్‌ యూఏవీ, డ్రోన్‌ మార్కెట్‌ వాల్యూ 4.4 బిలియన్‌ డాలర్లు, 5 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశముందన్నారు. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఎల్బిట్‌ సిస్టమ్స్‌, షీబెల్‌ లాంటి అంతర్జాతీయ డిఫెన్స్‌ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు హైదరాబాద్‌లో ఉండటం ‘రైజింగ్‌ తెలంగాణ’కు నిదర్శనమన్నారు. ఈ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీలో ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్లు తయారవుతాయన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుందని, ప్రొడక్షన్‌, రీపేర్‌, టెస్టింగ్‌ ఇలా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయని చెప్పారు. కొత్తగా 300 మందికి హైవాల్యూ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జేఎస్‌ డబ్ల్యూ డిఫెన్స్‌ ఫౌండర్‌ పార్థ్‌ జిందాల్‌, ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page