తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువైనది. దినికి తెలంగాణ రాష్ట్ర పొలీస్ 2024 వార్షిక నివేదిక సాక్ష్యం గా నిలుస్తుంది. 2023 సంవత్సరంలో పోలీస్ వార్షిక నివేదిక ప్రకారం 1872 ఎస్సీ ఎస్టీ అత్యాచారా నిరోధక చట్టం కింద కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో వాటి సంఖ్య 2257 పెరిగింది. పోలీస్ స్టెషన్ మెట్లు ఎక్కని సంఘటనలు ఇంతకు రెండిరతల వుంటాయి.నిత్యం ఎదొ ఒక చోట దళిత,గిరిజనుల పై అత్యాచారాలు, కుల దురంహంకార హత్యలు,కుల దూషణలు,భూ అక్రమణలు,దేవాలయాల ప్రవేశ నిరాకరణలు చేస్తు అవమానాలకు గురి చెస్తున్నారు.దొంగతనాల పేరుతో పొలీసులే ఎస్సీ ఎస్టీ లను లాకప్ చిత్ర హింసలకు గురి చెస్తున్నారు.ఎస్సీ, ఎస్టీ ల పై దాడులను అరికట్టాలని, నిందితుల పై కఠిన చర్యలు తీసుకొవాలని జాతీయ ఎస్సీ కమిషన్,జాతీయ ఎస్టీ కమిషన్ లు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నిత్యం పర్యవేక్షిస్తున్న, చర్యలు తీసుకొవాలని ఆదేశిస్తున్న ప్రభుత్వ,పోలీసు యంత్రాంగానికి చెవికెక్కడం లేదు. రాష్ట్రం లో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే చైతన్య వంత సమాజంగా ప్రచారంలో తెలంగాణాలొ అమానవీయమైన సంఘటనలు పెరిగిపొతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబుబ్ నగర్ లోని నారయణపేట జిల్లా కృష్ణ మండలం లోని మూడుమ్మాల్ గ్రామంలో దళితుడైన ఒబులేష్ తన పెండ్లి ని గ్రామస్తులు అందరు వెడుకలు జరుపుకునె యోగెంద్ర స్వామి అలయంలో నిశ్శయించుకొని బంధువులందరికి ఆహ్వనించుకొని పెండ్లి చెసుకొవడానికి గుడిలోకి వెళ్ళగా పూజారి ప్రభుత్వ ఉద్యోగి చక్రపాణి గుడికి తాళం వెసుకొని పెండ్లిని అడ్డుకున్నారు.
అదే అవమానం తో కుమిలిపొయి గుడిబయట పెండ్లి చెసుకొవాల్సిన పరిస్థితి దాపురించినది. నిందితుడిని అరెస్టు చెయడానకి దళిత సంఘాలు జెఎసిగా ఏర్పడి పోరాటం చేయాల్సివచ్చినది.చివరకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం గ్రామాన్ని సందర్శించి పౌర హక్కుల దినొత్సవాన్ని నిర్వహించి దళితులను అలయ ప్రవేశం చెయించాల్సి వచ్చినది. మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లోని తన ఫామ్ హజ్ పక్కనే మర్కుక్ లో మోడల్ పొలీస్ స్టెషన్ పరిధిలోని కూత వెటు దూరంలోని శివారు వెంకటాపూర్ లో గ్రామ దేవతల పండుగ,నూతన దుర్గమాత దేవాలయం ప్రారంభ వేడుకలలో దళితుల బొనాలను సమర్పించకుండాదళితేతరులు అడ్డుకున్నారు. వివక్ష,అవమానానికి గురైన దళిత మహిళలు బొనాలను కాలువలో వెయాల్సి వచ్చినది. వివక్ష పాటించిన వారిపై కేసుల నమోదు చేయడంలో మోడల్ పోలీసులు సైతం నిర్లక్ష్యం,వివక్షతను ప్రదర్శించారు. మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతొజిగూడ గ్రామానికి చెందిన శంకరయ్య,లక్ష్మి కుమారులు ఉన్నత చదువులు చదువుకొని ప్రవెట్ ఉద్యోగాలు చెస్తు డప్పు కొట్టాడాన్ని నిరాకరించినందుకు అర్జున్,చంద్రం ల కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసి తమ ఆదేశాలను దిక్కరిస్తే 50 వేల జరిమాన విధిస్తామని గ్రామ పెద్దల ముసుగులో అధిపత్యాన్ని చాటారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భాధితులకు రక్షణ కల్పించాలి హైకోర్టు సైతం ఆదేశించినది.
భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దళిత ఎస్.ఐ శ్రీ రాముల శ్రీ నివాస్ పై పైఅధికారుల కుల వేధింపులకు ఆత్మహత్య చేసుకొని బలిఅయ్యాడు. ఇటివల ఇబ్రహీంపట్నం మండలం రాయపొల్ గ్రామానికి చెందిన దళితుడైన బండారు శ్రీ కాంత్ అదే గ్రామానికి చెందిన తన క్లాస్ మెంట్ బిసి అమ్మాయి ,పొలీస్ కానిస్టేబుల్ అయిన నాగమణిని ప్రేమ, కులాంతర వివాహం చెసుకున్నారు.తక్కువ కులం వాడిని పెండ్లి చెసుకుంటావా అని తన తమ్ముడే అత్యంత దారుణంగా హత్య చెశాడు. ఇటివల మరో సంఘటన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగినది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని తుక్కు గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దళితుడైన రాములు సార్ కాలు ఎనిమిదొవ తరగతి చదువుతున్న అయ్యప్ప మాల వేసుకున్న విద్యా ర్ధికి తగిలినదని అయ్యప్ప స్వాముల తమ నిష్ఠను వదిలి పాఠశాలలోకి వచ్చి దాడికి పాల్పడ్డారు.అంతటితో ఆగకుండా విద్యా బుద్దులు నేర్పే ఉపాధ్యాయుడితో విద్యార్ధి కాల్లు మొక్కించి ,క్షమాపణలు చెప్పించి ఆవమాన పర్చారు.కుల దురంహంకారానికి దళితులు సమిధలవుతున్నారు.కుల నాగు కాటుకు బలవుతున్నారు. తెలంగాణా పొలీస్ వార్షిక నివేదిక ప్రకారమే బాధితులలో 82 శాతం కేసులలో 18 సంవత్సరాల లొపు మైనర్ లే అంటె దళిత,గిరిజన బాలికల పై అత్యాచారాలు నిత్యకృత్యంగా సాగుతున్నాయని చెప్పక తప్పదు. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు 41 సిఅర్పిసి ప్రకారం పోలీసులు స్టేషను బెయిల్ ఇస్తుండటంతో ఎస్సీ ఎస్టీ ల పై దాడులు మరింత పెరుగుతున్నాయి.నిందితులకు శిక్షలు రెండు శాతం దాటడం లేదు. పొలీస్ ల వార్షిక నివేదిక ప్రకారమే కేవలం 17 కేసులలో 20 మంది నిందితులకు మాత్రమే జీవిత శిక్ష పడిరది.న్యాయస్ధానాలలో కేసులను రుజువు చెయించండంలో ఎస్సీ ఎస్టీ కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు పట్టించుకొవడం లేదు.
బాధితులకు అందని నష్టపరిహారం…
ఇక బాధితులకు ఎస్సీ,ఎస్ఠి అత్యాచారాల నిరోధక చట్టప్రకారం అందించాల్సిన తక్షణ సహయం,నష్టపరిహారం, పునరావాసం కల్పించడంలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతుంది. తెలంగాణ పొలీస్ వార్షిక నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో 2257 కేసులలో కేవలం766 మంది బాధితులకు మాత్రమే పాక్షికంగా నష్టపరిహారం అందినది.ఇక పునరావాసం కల్పించడం మరిచారు.నష్టపరిహారం అందించాలని హైదరాబాదు ప్రజాభవన్ లో జరుగుతున్న సియం ప్రజావాణి లో బాధితులు దరఖాస్తు లు పెట్టుకొవాల్సిన పరిస్థితి. ప్రజావాణి అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని నగరం లోని బేగంపేట పొలీస్ స్టేషను పరిధిలోని రసూల్ పురా అన్నానగర్ కు చెందిన యాదమ్మ అనె బాధితురాలకు ప్రోసిడిరగ్ ఇప్పించి నెలలు గడుస్తున్న నిధులు లేవని దళిత అభివృద్ధి, ఆర్ధిక శాఖ లు చేతులెత్తెశాయి.యాదమ్మ లాంటి వేల మంది ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్ధిక సహయం కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి.
రాష్ట్ర హోమ్ శాఖ,దళిత అభివృద్ధి శాఖను చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రజా పాలనలో ఏడాదిలో ఒక్కసారైన ఎస్సీ ఎస్టీ ల రక్షణల పై సమీక్షించిన దాఖాలు లేవు.కొత్త సంవత్సరంలో నైన ఎస్సీ ఎస్టీ హైపవర్ కమిటి చైర్మన్ అయిన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం హైపవర్ కమిటి సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసి 75 ఏళ్ళ భారత రాజ్యాంగ స్పూర్తితో సమాజంలో సమానత్యం,గౌరవం, రక్షణ సామాజిక న్యాయం అందించాల్సిన అవసరం వుంది.ఇటివల ముగిసిన లోకసభ సమావేశం లో ప్రవేశ పెట్టిన పార్లమెంటు స్ఠాండిరగ్ కమిటి సైతం ఎస్సీ ఎస్టీ లపై నేరాలను ఆరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయని స్పష్టం చేసింది. నిర్దిష్ట చర్యలు తీసుకుని ఎస్సీఎస్టీలకు రక్షణ కల్పించాలనె పార్లమెంటు స్టాండిరగ్ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ లకు రక్షణ కల్పించాలి.
-పి.శంకర్
జాతీయ కార్యదర్శి,
దళితబహుజన ఫ్రంట్ (డిబిఎఫ్)
9441131181