– సిఎం రేవంత్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్9: సిఎం రేవంత్ రెడ్డి బీసీ రాజకీయాలను ఉపయోగించి దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక విధంగా మాటలు చెప్పి, తర్వాత మరో విధంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డికి కొత్త విషయమే కాదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిసి రిజర్వేషన్ల విషయంలో ఎందుకు సక్రమంగా వ్యవహరించలేదని అరవింద్ ప్రశ్నించారు, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ను లోపల ఎందుకు ఉంచలేదు, కేటీఆర్‌ను లోపల ఎందుకు ఉంచలేదు, కవిత రాజీనామాను ఎందుకు ఆమోదించకపోతున్నారని ప్రశ్నించారు. హరీష్ పాల వ్యాపారం, సంతోష్ టానిక్ సంబంధిత అంశాలను, అలాగే కల్వకుంట్ల కుటుంబంతో చేసిన ఒప్పందం బయటకు రాకుండా చేయడానికి రేవంత్ బీసీలను రాజకీయ వ్యూహంగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ చేయలేదు. తమిళనాడులో తెచ్చుకున్నప్పుడు కూడా రేవంత్ కు తెలియలేదు. ఇప్పుడు బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





