తరుణ్‌ ‌తేజ్‌పాల్‌కు కోర్టు షాక్‌

– లైంగిక దాడి కేసులో దోషిగా గోవా ధర్మాసనం నిర్దార‌ణ‌

ముంబై, ఆగస్ట్ 6 : తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ ‌తేజ్‌పాల్‌ను 2013 ‌నాటి లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్దారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్‌ ‌డాక్టర్‌ ‌నీలా గోఖలే, జస్టిస్‌ అమిత్‌ ‌జమ్సందేకర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద తరుణ్‌ ‌తేజ్‌పాల్‌ను దోషిగా నిర్దారించింది. అతడికి విధించిన శిక్షను ధర్మాసనం ప్రకటించనుంది. గోవా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా తన వాదనలు వినిపించారు. కుమార్తె వయస్సు ఉన్న యువతితో అతడు ఈ విధంగా వ్యవహరించారని తెలిపారు. బాధితురాలు పదే పదే తిరస్కరించినప్పటికి తేజ్‌పాల్‌ ‌తన ప్రయత్నాలను కొనసాగించాడని పేర్కొన్నారు. అదీకాక మ్యాగజైన్‌ ‌సంపాదకుడిగా అతడు గౌరవమైన స్థానంలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు తరుణ్‌ ‌తేజ్‌పాల్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని ఈ సందర్భంగా కోర్టుకు తుషార్‌ ‌మెహతా విజ్ఞప్తి చేశారు. 2013లో గోవాలోని ఓ రిసార్ట్ ‌వేదికగా తెహెల్కా పత్రిక థింక్‌ ‌ఫెస్ట్ ‌కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మ్యాగజైన్‌ ‌సంపాదకుడు తరుణ్‌ ‌తేజ్‌ ‌పాల్‌ ‌తనపై లైంగిక దాడి చేశాడని సహోద్యోగి ఆరోపించారు. మరికొద్దిసేపట్లో కోర్టు అతడికి శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో తేజ్‌పాల్‌ ‌స్పందించారు. తనపై దయ చూపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తన వయస్సు 62 ఏళ్లని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను బాధితుడినని నమ్ముతున్నానన్నారు. తనకు భార్య కూడా ఉందన్నారు. అంతుకు మించి చెప్పడానికి ఏ లేదంటూ తేజ్‌పాల్‌ ఈ ‌సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *