తమ తప్పులపై చర్చ జరుగుతుందనే కుట్ర

– శాసన సభలో బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్‌ విమ‌ర్శ‌లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాలు చర్చకు రావద్దని, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవుపై, కొంతమంది చేసిన క్షుద్ర పూజలు చర్చలు వస్తాయని సభ మొదటి రోజే కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. శాసన సభలో బుధవారం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమేనని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలనేదే తవ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయం

సభలో ప్రతీ సభ్యుడి హక్కులను కాపాడేది సభాపతి అని అన్నారు. గత ప్రభుత్వమే సభ నిర్వహణపై కొన్ని నిబంధనలు రూపొందించిందని, ఆ నిబంధనల మేరకే సభాపతి ఆదేశాలు ఇచ్చారని, సభాపతి ఆదేశాలను గేట్-3 వద్ద పోలీసులు అమలు చేశారని చెప్పారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ నల్ల టీషర్టు వేసుకుని వెళ్లారని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు.. నినాదాలతో కూడిన టీషర్టులతో లోపలకు రాకూడదని స్పీకర్ ఆదేశాలిస్తే వారు పాటించేవారు.. లోక్‌సభ స్పీకర్ పార్లమెంటులో అలాంటి నిబంధనలు విధించలేదు అని చెప్పారు. కానీ శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉండాలో గత ప్రభుత్వమే రూపొందించిందని, బీఆరఎస్ సభ్యులు పోలీసులను దూషించి, అర్ధనగ్న ప్రదర్శన చేసి, సభాపతిని కూడా దూషించారని సీఎం ఆరోపించారు. దీనిపై సభాపతికి క్షమాపణ చెప్పి సమస్యలపై చర్చ జరుపుతారని భావించి మీరు వారిని సభలోకి అనుమతించారు కానీ వారు విచక్షణ కోల్పోయి వ్యవహరించడం వల్లే వారిని మీరు సస్పెండ్ చేశారని అన్నారు. వారు సభకు రాలేదని ప్రజా సమస్యలపై చర్చించే భాధ్యతను విస్మరించలేదు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *