ఇల్లు కూల్చివేత, భూముల
గుంజుకోవడం తప్ప ఏం చేశారు..
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్‌సుఖ్ నగర్, బృందావన్ హోటల్లో కూర్చుని కాంగ్రెస్ నేతలు గ్యారంటీల గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో 66 హామీలు ఇచ్చి కేవలం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడా ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు, కౌలు రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ నైజం తెలియడానికి 9 నెలల సమయమే పట్టిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అనేక సమస్యలపై పోరాటాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నిజాల గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో బిజెపి నియోజకవర్గాల వారీగా ప్రజలతో ముచ్చటించడం, సమస్యలు తెలుసుకోవడం, బైక్ ర్యాలీలు,సభలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో జిహెచ్‌ఎంసిలో సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 7న బిజెపి సభ నిర్వహించుకోవాలని నిర్ణయించిందని ఈటల వివరించారు.
పెన్షన్లు కోల్పోయిన వారు, పెన్షన్ పెరుగుతాయని ఆశపడ్డ వారు, బంగపడిన ఆటో డ్రైవర్లు అనేక వర్గాల ప్రజలు ఆ సభలో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ హామీల గారడీలను ప్రతీ గడపకు, ప్రతి వాడకు, ప్రతీ గ్రామానికి తీసుకువెళ్లే కార్యక్రమాలను ఆవిష్కరించిందన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకోవాలి కానీ రేవంత్ రెడ్డి వొచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకటి ఇల్లు కూలగొట్టడం రెండు భూములు గుంజుకోవడం అని విమర్శించారు. హైడ్రా అని ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వపరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చివేశారు అని ప్రశ్నిచారు.
ప్రజల చైతన్యం, బిజెపి అండతో ప్రజాక్షేత్రంలో వొస్తున్నటువంటి ఆగ్రహానికి ప్రభుత్వం తోక ముడిచిందని, హైడ్రా పేరిట కూల్చివేతలను నిలిపివేసిందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ వేశాడు రేవంత్ రెడ్డి. కెసిఆర్ కాళేశ్వరం స్కెచ్ వేసుకున్నాడు.. అలాంటి ప్రాజెక్టులు లేవు. కాబట్టి మిగిలింది మూసీ ప్రక్షాళన అని దిల్లీ వెళ్లి వాళ్ల హై కమాండ్ తో ఏం మాట్లాడుకున్నాడో కానీ సుందరీకరణ పేరిట వేలాది ఇల్లు రివర్ బెడ్ లో ఉన్నాయి, బఫర్ జోన్, ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పి ప్రజలు ఏడుస్తున్నా కూడా వందలాది మంది పోలీసులు మధ్యలో కూలగొట్టే ప్రయత్నం చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజల చైతన్యంతో ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో కొంత వెసులుబాటు పొందారు అని ఈటల అన్నాఉ. సరం లేదు కానీ రేవంత్ రెడ్డి అహంకారంతో మళ్ళీ 330 ఫీట్లతో మరొక రోడ్డుకు శ్రీకారం చుట్టాడు. మూసి, హైడ్రా, లగిచర్ల ఘటనలపై ఎదురు దెబ్బలు తగిలినా సిగ్గులేకుండా నియంతలాగా, శాడిస్ట్ లాగా రేవంత్ రెడ్డికి చేస్తే మంచిది కాదని ఈటల రాజేందర్ అన్నారు.