సాహిత్యానువాదం ప్రాముఖ్యత సదస్సు

ఛాయ పబ్లికేషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్వర్యంలో ‘మనుషులు మాయమయ్యే కాలం’, ‘ఘాంద్రుక్‌’ పుస్తకాల ఆవిష్కరణ, 2025 జూలై 5 వ తేదీ ఉ. 10.00-మ.1.00 వరకూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో జరుగనుంది ‘‘సాహిత్యానువాదం ప్రాముఖ్యత’’ అనే అంశం మీద మాట్లాడేందుకు ప్రొ. అరుణవ సిన్హా, కో- డైరెక్టర్‌ అశోక సెంటర్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ వస్తున్నారు. ప్రొ.అరుణవ ఛాయ ప్రతిష్టాత్మకంగా తెలుగు సాహిత్యంలో తీసుకుని వస్తున్న ‘‘ఛాయ విదేశీ సిరీస్‌’’ని ఆవిష్కరిస్తారు. ఈసిరీస్‌లో భాగంగా వచ్చే రెండున్నర ఏళ్ళలో 15 అంతర్జాతీయ భాషల నుండి 25 పుస్తకాలు తేవడానికి ఛాయ ఆయా ప్రచురణకర్తలతో ఇప్పటికీ ఒప్పందాలు చేసుకుంది. ఈసిరీస్‌లో  నోబెల్‌ గ్రహీతలు హాన్‌ కాన్‌, యాన్‌ ఫోసే, ఒరాన్‌ పాముక్‌ ల పుస్తకాలతో పాటూ, బుకర్‌ ప్రైజ్‌ పొందిన కైరోస్‌, ప్రాఫెట్‌ సాంగ్‌, డిస్‌కంఫర్ట్‌ ఆఫ్‌ ది ఈవెనింగ్‌, వెజిటేరియన్‌లు ఉన్నాయి. మరిన్ని సమకాలీన, కొన్ని క్లాసిక్స్‌ ఉన్నాయి.

వి.వి. గణేశానందన్‌ రాసిన ‘‘మనుషులు మాయమయ్యే కాలం’’ అనే పుస్తకాన్నీ అరుణవ సిన్హా ఆవిష్కరిస్తారు. ఈ పుస్తక గురించి అనువాదకురాలు ఉమా నూతక్కి, అనిల్‌ కుమార్‌, ప్రొ. కాశీంతో అరుణాంక్‌ లత సంభాషిస్తారు. ‘‘మనుషులు మాయమయ్యే కాలం’’ ఛాయ విదేశీ సిరీస్‌లో రెండవ నవల. కల్లోల శ్రీలంక అంతర్యుద్ధాన్ని చిత్రించిన నవల. ఆఅంతర్యుద్ధంలో ఒక కుటుంబం విచ్చిన్నమైన వైనాన్నీ, అప్పటి పరిస్తితులను చిత్రికపట్టింది.

పద్దెనిమిది సంవత్సరాలు రచయిత్రి చేసిన పరిశోధనకు సాహిత్య రూపం ఈ నవల. మూడు ప్రపంచ ప్రఖ్యాత అవార్డుల (కరోల్‌ షీల్డ్స్‌ ప్రైజ్‌ ఫర్‌ విమెన్‌ 2024, విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌ 2024, ఏషియన్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌ 2023)ను ఈ నవల పొందింది.
కర్నాటక సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత బుక్‌ బ్రహ్మా లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ సతీష్‌ చప్పరికె రచించిన నవల  ‘‘ఘాంద్రుక్‌’’ కన్నడ సాహిత్యంలో మైలురాయిగా చెప్పుకునే ఈనవల హిమాలయన్‌ అన్నపూర్ణ సర్కిట్‌ ట్రెక్కింగ్‌ నేపథ్యంలో రాయబడిరది.

వైయక్తిక సంఘర్షణ నుండి శాంతిని కోరుకునే సిద్ధార్థ్‌ హోస్మనే, ప్రాపంచిక సమస్యలను చూసి చలించి శాంతి కొరకు వచ్చిన సోఫియాల కథే ఈ నవల. స్టార్టప్‌ కంపెనీలు విస్తృతంగా పుట్టుకు వస్తున్న ఈ కాలంలో వాటిని కొందరే నిలబెట్టుకున్తున్నారు. ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారో ఈ నవల చర్చించింది. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోన్న అంతర్యుద్ధాలను ఈ నవల నమోదు చేసింది. ఈ నవలను ప్రొ. ఎస్‌. కమలాకర శర్మ ఆవిష్కరిస్తారు. పుస్తకం గురించి రచయిత సతీశ్‌ చప్పరికే, ప్రొ. తారకేశ్వర్‌, కె శ్రీనివాస్‌తో మోహన్‌ బాబు సంభాషిస్తారు.

-ఛాయ పబ్లికేషన్స్‌,
-ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page