1970ల నుంచి 1990ల దాకా తెలుగు సీమ అంతటా విప్లవ గాయకుడుగా, కవిగా సుప్రసిద్ధుడైన ఎన్‌కె (ఎన్‌కె రామారావు) భౌతికంగా మన నుంచి దూరమై ఇవాళ్టికి పది సంవత్సరాలు. ఆయన జీవిత కాలంలో ఒక కవితా సంపుటం, ఒక దీర్ఘ కవిత, ఒక ఆత్మకథాత్మక రచన ప్రచురించాడు గాని అనేక ఇతర రచనలు పుస్తకరూపం ధరించకుండానే ఉండిపోయాయి. ఆయన స్మృతిలో ఇప్పుడు ఆయన సమగ్ర రచనలు వెలువరించాం. ఆ పుస్తకానికి ఎన్. వేణుగోపాల్, వివి, కాత్యాయనీ విద్మహే రాసిన ముందుమాటలు రాసారు. చిరకాలం జీవించే ఎన్ కె రచనలు 2014 డిసెంబర్ 27న తన అరవై ఆరో ఏట భౌతికంగా మన నుంచి దూరమైపోయిన ఎన్‌కె తన కవిత్వంలో, పాటలలో, సృజన శక్తిలో, మా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా ఉన్నాడనడానికి, ఉంటాడనడానికి సాక్ష్యమే పది సంవత్సరాల తర్వాత వెలువడుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ..
వీక్షణం స్టాల్ నం.295, ప్రజాతంత్ర స్టాల్ నం.164లో అందుబాటులో ఉన్నాయి.