అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సిఎం రేవంత్ రెడ్డి విచారం
