ఎక్కడ ఏ సాహిత్యసభ జరిగినా సాహిత్య ఉత్సవం జరిగినా నాకు ఆనందమే. ఎందుకంటే అనేకరకాల వ్యక్తుల, భావాల కలయిక, సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అట్లాగే ఇప్పుడు జరగబోతున్న ఛాయాసంస్థ నిర్వహించే ఛాయా లిటరరీఫెస్టివల్ విజయవంతంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంలో ఏ సాహిత్య సమ్మేళనానికైనా, సభకైనా ఒక పర్పస్ ఉండాలనేది నా అభిలాష. ఇటీవలకాలంలో దేశంలో చాలాచోట్ల సాహిత్య ఉత్సవాలు, లిటరరీ ఫెస్టివల్స్ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఉత్సవాల్లో ఆత్మ లోపిస్తోంది.
అంటే ఏ ఉద్దేశంతో ఉత్సవం నిర్వహిస్తున్నారో ఆ ఉద్దేశానికి భిన్నంగా చర్చలు, వచ్చేవ్యక్తులు, వారి పోకడలు వారి అభిభాషలు ఉండడం దీనికి కారణం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఛాయ సాహిత్యోత్సవంలో ఎక్కువమంది యువకులు పాల్గొంటున్నట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇటీవల కాలంలో యువతరం మీద ఒక ఆరోపణ ఉంది. వీరు సాహిత్యంతో, సమాజంతో సంబంధం లేకుండా గడిపేస్తిన్నారని. ఎక్కడో ఒక సందర్భంలో కొంత గ్యాప్ వస్తే రావచ్చు తప్ప ఎప్పుడైనా సాహిత్యాన్ని సమాజాన్ని నడిపించేది యువతరమే. కాబట్టి ఈ ఉత్సవం యువతరంతో, సామాజిక బాధ్యతతో, నడపగలిగితే ఇది గొప్ప విజయం అవుతుందని సాహిత్యోత్సవాలకు మలుపు అవుతుందని నా భావన. అలా కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
-వాసిరెడ్డి నవీన్





