సాహిత్య కలయికలను స్వాగతించవలసిందే. మానవ జీవనక్రమణికకు వెలుగు, నిరంతర సృజనన్వేషణ ఈకాలపు అవసరం. సున్నిత మనుషులను ఊహించడం మాత్రమేనా! కాలం, సందర్బం కలగలిపి కొత్తచూపుతో నూతన అక్షరాన్ని వెతకాలి. మనుషుల తెలివిడితో నిర్మితమైన సహజీవన స్రవంతిని నిలుపు కోవడానికి సాహిత్యమే పునాది. కొత్త ఒరవడిని ‘ఛాయ’ తెలుగు సాహిత్యానికి పరిచయం చేస్తుంది.
ఈ నూతన ఒరవడి ఇవాళ్టి అవసరం కూడా. సృజనకారుల సంగమస్థలి మాత్రమేకాదు- ఒకరి అన్వేషణలో మరొకరు భాగం కావడానికి కలిసి పనిచేయడానికి సాహిత్యమే వనరు. నూతనతరపు అభిరుచులు, రచయితల, పాఠకుల అనుభవాలు మరింత మేలిమి కావడానికి ‘ఛాయ’ వేస్తున్న బీజం. ఈ సాహిత్య ప్రయోగం తెలుగుసాహిత్య విస్తృతికి దోహదకారి కావాలి. ‘ఛాయ’ కలెక్టివ్ కు శుభాకాంక్షలు.
-అరసవిల్లి కృష్ణ





