– ఇవ్వకపోతే మేమే భరిస్తాం
– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
– ఈనెల చివరిలోగా భూముల విలువల సవరణ
– మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: రాష్ట్రం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురు చూస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు రూ.1.13 లక్షల వాటా ఇవ్వాల్సి ఉందని, ఆ నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్లు నిలిపివేశామని అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. తన ఛాంబర్ లో మంత్రి పొంగులేటి మీడియాతో శనివారం చిట్ చాట్ మాట్లాడుతూ కేంద్రం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డితోపాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశామని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోవైపు ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి రూ1.60 లక్షలను తాత్కాలికంగా ఆపామని, ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి విడత మూడున్నర లక్షలకుపైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబా ద్లో ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడత మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్మెంట్ లెవె ల్, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇం డ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో నియో జకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న క్యాబినెట్లో చ ర్చించి ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ & రిజి స్ట్రేషన్, సర్వే అంశాలపై విస్తృతంగా చర్చిం చాం. ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విష యాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించాం. ఈసారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్తాలను సమా వేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరి హద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరి హద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పిం చాం. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసే లా ఆదేశించాం. 1/70 సమస్యపై కూడా చ ర్చించాం. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రె వెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతా మన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతాం. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పా టుకు టెండర్లు పిలిచాం. సుమారు 14.08 కోట్లతో టెండర్ ఖరారు అయింది. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుంది.
గత ప్రభుత్వహయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన 2బిహెచ్కి ఇండ్లకు సంబంధిం చి పాతరేట్లతో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను కో రాం. అత్యధిక శాతం ఈ పనుల పూర్తికి ముం దుకు రానందున లబ్దిదారులను ఎంపిక చేసి వారికే మిగిలిన మొత్తాన్ని ఇస్తూ వారిచేతనే పూర్తిచేయించేలా నిర్ణయించాం. ఈమేరకు ఈనెలాఖరులోగా ఇటువంటి ఇండ్లను గుర్తిం చేలా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న ధరలను క్రమబద్దీ కరించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈనెల చివరిలోగా భూ ముల ధరలను సవరించి అమలులోకి తీసుకు వస్తామని వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లో 2022 సంవత్సరంలో ఆరునెలలు తిరగ కుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచారని అన్నారు. ఆర్థిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి భూముల ధరలను సవరిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 38 వేల ఇండ్లకు లబ్దిదా రు లను ఖరారు చేసింది. తర్వాత ఏడాది పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించగా వీరిలో సుమారు 16వేల మంది అసలు ఆ ఇండ్లలో దిగలేదని తేలింది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉం టూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాం తాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించా లని నిర్ణయించాం. అర్హులను ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మౌలిక సదు పాయాలు కల్పిస్తాం. జిహెచ్ ఎంసీ పరిధిలో మూడు కార్పోరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తాం. ఒకే స్థలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇండ్లను వన్ ప్లస్ వన్ పద్దతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం. సు మారు 40-50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే.ఎన్ ఆర్ జే ఎ ఎం ఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాటి స్థానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూ రు చేసేందుకు పరిశీలిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్దిదారులు స్థానికంగా ఇసుకను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్ కు కూడా మట్టిని పొందేలా అవకాశం ఇవ్వాలని, ఎటువంటి అభ్యంతరాలు తెలుపకూడదని అధి కారులను ఆదేశించాం. గతంలో ప్రైవేటు భూ ములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి లేఅవు ట్లు వేశారు. వాటిలో కొన్ని ఖాళీలు ఉన్నా యి, మరికొన్ని చోట్ల కబ్జాకు గురయ్యాయి. ధరణి కారణంగా గతంలో భూమి అమ్మిన వ్యక్తి పేరిటే మళ్లీ సదరు భూమి ఉన్నట్లు రావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఇటువంటి అంశాలపై సమగ్రనివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. కబ్జాదారులను ప్రభుత్వ భూమి ని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైన చోట ప్రభు త్వ భూములకు ప్రహారీతో రక్షణ కల్పిస్తాం. పాలేరు నియోజకవర్గాన్ని 20 వేల ఓటర్ల చొప్పున 14 క్లస్టర్లుగా విభజించి ఇప్పటి వర కు 13 ప్రాంతాలలో ప్రజా దర్బార్ నిర్వ హించాం. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా 52 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోస మే ఉన్నాయి. తర్వాత స్థానంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, గృ హలక్షి, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డులలో కుటుంబీకుల పేర్ల చేర్పు వంటివి ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయన్నారు. ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కచ్చతమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





