మొరాకోలో భూకంప విలయం
న్యూదిల్లీ,సెప్టెంబర్9: మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్ నుంచి మరకేష్ వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోటర్ల దూరంలో…
