Category Uncategorized

అంబేద్కర్ వాదులనే అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం హిమాయత్‌నగర్‌…

చినజీయర్ స్వామిజీకి భారత్ వరల్డ్ రికార్డుల్లో స్థానం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ముచ్చింతల్ లోగల చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా మూర్తి పేరిట ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామికి భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కెవి.రమణారావు భారత్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసిన ధృవపత్రాన్ని అందజేశారు. అహోబిల జీయర్…

డిబిపి మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణస్వరూప్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :  దళిత బహుజన పార్టీ(డిబిపి) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం హిమాయత్‌నగర్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరప్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దళిత జాతులను ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం, ప్రజలందరికి ఉచితంగా విద్యా,…

అమీన్ పూర్ లో అంగరంగ వైభవంగా దసరా సంబరాలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24:  దసరా పండుగను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బీరంగూడ గుట్ట పైన దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జెండా ఎగరవేసి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.అనంతరం బీరంగూడ గుట్ట పైన గల శివాలయం ఆవరణలో…

దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో  నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద నిర్వహించిన ద్వజారోహన కార్యక్రమంలో పాల్గొని, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు.…

ఆర్థిక సాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన  కాసాని పాపన్న(50) అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు పరామర్శించి రూ.5000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ నాయకులు ప్రసాద్, మరాటి వెంకటస్వామి మాట్లాడుతూ… గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులు మృతి చెందితే వారి కుటుంబ…

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 24: అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని నరేంద్ర కాలనీ, ఇస్నాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ విజయదశమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.…

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దుర్గాదేవి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు…

బండ్లగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దశాబ్ది కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన…