Category Uncategorized

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ బి ఆర్ ఎస్. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేసిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధి హైదర్ నగర్ డివిజన్ లోనీ హైదర్ నగర్ గ్రామంలోని  మసీద్ ముందు ప్రచారం నిర్వహించారు ఈ…

బిఆర్ఎస్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే నయవంచన 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  నమ్మకానికి ప్రతీక బిఆర్ఎస్ పార్టీ అని నయవంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి, నల్లవల్లి, మంబాపూర్, రామిరెడ్డి బావి, వీరన్న గూడెం, మొల్లగూడెం,…

ఎన్నికల నిబందనలు పాటిస్తు ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులను నిర్వహించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 17 :ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ,పూర్తి అవగాహనతో ఎలాంటి పొరపాట్లుజరగకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ భారతి హోలీకేరీ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లాఎన్నికల అధికారి,కలెక్టర్ భారతి హోలీకేరీ, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ తో కలిసి రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాల…

బందుల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడదాం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17 : బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారని కొడంగల్ మాజి  ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు  దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి 15 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని గురునాథ్ రెడ్డి పార్టీ కండువా…

ముస్లిం వోటర్ల తీర్పు పైనే తెలంగాణ ఎన్నికల ఫలితాలు..

రాజధానిలో ప్రస్తుతం ఎంఐఎం(మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌)  ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం వోటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వీరు బీఆర్‌ఎస్‌ కు మద్దతుగా నిలిచారు. గులాబీ పార్టీ ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో కీలక…

ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపు కోసం బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. శుక్రవారం పలు వార్డులలో ఆమనగల్ పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు జేనిగల యాదగిరి యాదవ్ ప్రచారం చేసి ఓట్లు అడిగారు. ఒక్క అవకాశం ఇస్తే ఆమనగల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని…

కెఎల్ఆర్ సమక్షంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి,జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల మల్లయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు గంగుల నిఖిత రాకేష్ రెడ్డి లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…

ఆచారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి గెలుపు కోసం ఆయన సతీమణి గీత ఆమనగల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన భర్త ఆచారి బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఐదు సార్లు పోటీ చేసి ఆరోసారి మీ ముందుకు వచ్చారని ఆయనను…

బిఆర్ఎస్ పార్టీకే మాలల సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బిఆర్ఎస్ పార్టీకే మాలల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల…