Category Uncategorized

రాజద్రోహం చట్టం 124 ఎ పై స్టే

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు కేసులు రద్దు న్యూ దిల్లీ, మే 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌సుప్రీమ్‌ ‌కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్‌ ‌కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

ఆర్థిక సంక్షోభం నుండి రాజకీయ సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక…

నర్సులకు నమస్సులు

సేవాతత్పరులు సంరక్షణా నేత్రులు ఆరోగ్య ప్రదాతలు మానవతామూర్తులు వైద్య సహాయక నర్సులు   వ్యాధి పీడిత బాధితులకు సపరిచర్యలు చేసే దాత్రులు   రోగకారక మహమ్మారులపై నిశబ్ద పోరు చేసే వీరసేనలు   అపత్కాల సమయంలో ఆదరించే ఆపథ్బాంధవులు   భరోసా వచనాలు వల్లించి విశ్వాసం పొదిపే ధీరజులు     రక్తమోడే క్షతగాత్రులను చేరదీసే…

నియంతృత్వ పోకడలకు ముకుతాడు !

ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ ‌తొలగింపు. రాజద్రోహం…

నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అవివాహితలు ఇంటి…

పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన…

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్

ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ ‌లీకేజ్‌ ‌వ్యవహారంలో అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ‌ప్రశ్నాపత్రాల…

అసని తుఫాను ప్రభావంతో… రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు  ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ…

సోయి లేకుండా రాజకీయ విమర్శలు

కెసిఆర్‌ ‌భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.  కోనాపూర్‌…