Category Uncategorized

ములుగు జిల్లాకు నిర్భయ నిధి రూ.10 కోట్లు మంజూరు

కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్‌ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. అలాగే పెండిరగ్‌ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,…

congress dharna : కాంగ్రెస్‌ ధర్నాకు పలు పార్టీల మద్దతు

– పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్న మొదటి రాష్ట్రం తమిళనాడు – రేవంత్‌ ప్రయత్నాలకు డీఎంకే సహకారం: కనిమొళి న్యూదిల్లీ, ఆగస్టు 6: దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు…

కేర్‌ హాస్పిటల్స్‌లో అరుదైన హార్ట్‌ సర్జరీ

– విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు నల్గొండకు చెందిన 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది చాలా క్లిష్టమైన హార్ట్‌ సర్జరీగా పరిగణిస్తారు. శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరగగా…

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి

– పేద‌వారికి స‌మ‌స్య‌లు రాకూడ‌దు – ల‌బ్దిదారుల‌కు ఉచిత ఇసుక ఇవ్వాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ ,…

రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు – మండలి చైర్మన్‌ గుత్తి సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు…

మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ఇందిరా మహిళా శక్తి సంబరాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబరాలను ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. మంత్రుల బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరా మహిళా…

బిజెపి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 7: రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసిల్దార్‌ గణేష్‌కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్‌ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌ పేరుతో రైతులను…

10న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తారు. మెడ్‌ప్లస్‌ ఫార్మసీలో ఫార్మసిస్టు, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌కు చెందిన వంద…