సామాజిక జీవితాన్ని అక్షరబద్ధం చేసిన యశోదారెడ్డి
నేడు పాకాల యశోదారెడ్డి వర్ధంతి ఆమె తెలంగాణ గర్వించ దగిన సాహితీ మూర్తి. తెలంగాణ సజీవ భాషను తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందిన సాహితీవేత్త. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా పేరు గడించారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు బహు పండిత ప్రశంసా పాత్రాలు అయినాయి.…
