Category తెలంగాణార్థం

తెలుగు నాస్తికోద్యమ నాణానికి ఆంధ్ర బొమ్మ ‘గోరా’ – తెలంగాణ బొరుసు ‘సురమౌళి’

కాకతీయ కలగూర గంప – 9 ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్‌ లూజ్‌ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రక్కన వున్న…

ప్రజాగ్రహానికి ఆజ్యం పోస్తున్న ఇథనాల్!

ఇది రాస్తున్న సమయానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్ – భైంసా జాతీయ రహదారి మీద దిలావర్ పూర్ లో రైతుల, ముఖ్యంగా మహిళల రాస్తారోకో ఆందోళన అనంతర పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఆందోళన బుధవారం ఉదయానికి కూడా కొనసాగింది. వేలాది మంది దిలావర్ పూర్, గుండంపల్లి, సమందర్ పల్లి, రత్నపూర్ కాండ్లీ, చర్లపల్లి…

లగచర్ల ప్రజాగ్రహం గురించి మరొకసారి…

ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి.…

లగచర్ల ప్రజల ఆగ్రహపు అసలు సూచనలు

pharma company in Lagacharla village

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారు. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ తో సహా చాల మంది అధికారులు గాయపడ్డారు, లేదా తప్పించుకుని పారిపోయారు. ఈ దాడిని…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

పోలీసుల సమస్యల మీద కూడ పోలీసు బలప్రయోగమే!

గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు…

ఇరవై ఏళ్ల కిందటి చర్చల ఉజ్వల జ్ఞాపకాలు

ujwala gnapakaalu

తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు.…

తెలంగాణ బిడ్డ సాయిబాబాకు కన్నీటి నివాళి

 జాతుల సమస్య మీద, అణగారిన ప్రజా సమూహాల సమస్యల మీద ఆ అంతర్జాతీయ, జాతీయ అవగాహనకు కొనసాగింపుగానే ఎ ఐ పి ఆర్ ఎఫ్ 1997 డిసెంబర్ 28-29ల్లో వరంగల్ లో ప్రజాస్వామ్య తెలంగాణ సదస్సు నిర్వహించింది. అంతకు ముందే అదే సంవత్సరం భోనగిరిలో మార్చ్ 8-9ల్లో, సూర్యాపేటలో ఆగస్ట్ 11న తెలంగాణ ఆకాంక్షలపై సభలు…

మనలో కడగవలసినవి ఎన్ని ఉన్నాయి!

special story on konda surekha

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.…