Category తెలంగాణ

బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలి

– గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్‌ సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: బతుకమ్మను ప్రకృతిని ఆరాధించే పండుగ అంటూ ఈ పండగ తెలంగాణకు ప్రత్యేకమైన ఆస్తిత్వం అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ…

జల సంరక్షణతోనే జన రక్షణ

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ తొలి స్థానం పొందడంలో కీలక పాత్ర పోషించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోకెల్లా తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా…

పే స్కేలు వ‌ర్తింప‌జేయాలి

-మంత్రి సీత‌క్క‌కు ఎఫ్‌టీఏ ఉద్యోగుల విన‌తి -సానుకూలంగా స్పందించిన మంత్రి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26:  గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఎఫ్ టీఏలుగా  పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని శుక్ర‌వారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు  సచివాలయంలో పంచాయతీరాజ్…

ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం

– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడం వల్ల తెలంగాణ గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా ఎదగగల సామర్థ్యం ఉందని స్పష్టమవుతోందని, మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.…

కుల‌వృత్తులు నామోషీ కాదు

-మారుతున్న కాలానిక‌నుగుణంగా మారాలి – చాక‌లి ఐల‌మ్మ ఉద్య‌మ స్ఫూర్తి గొప్ప‌ది – ర‌జ‌కుల స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షా స‌మావేశం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26:  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. చాక‌లి ఐల‌మ్మ 130వ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా…

మొదటికొచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా వ్యవహారం

– రీ వెరిఫికేషన్‌లోనూ గందరగోళమే – స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల తీరుపై మొదట్నుంచీ అనుమానాలు అధికారులతో సమావేశంలో మంత్రి ఆగ్రహం! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాలు చేపట్టిన…

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతగోపీనాథ్‌

– ఎంపిక చేసిన అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్‌ నేతగా, జూబ్లీహిల్స్‌…

స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం

– నేతలను అలర్ట్ ‌చేసిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌- ముఖ్యుల‌తో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావుల టెలి కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌25: ‌స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం అయ్యింది. పార్టీ శ్రేణులను,కార్యకర్తలను అలర్ట్ ‌చేసింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌…

స్మితాసభ‌ర్వాల్‌కు హైకోర్టులో ఊరట

– ఘోష్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్‌ 25: ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘోష్‌ కమిషన్‌ నివేదికపై పలువురు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. ఈనేపథ్యంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ హైకోర్టును ఆశ్రయించగా ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.…