Category తెలంగాణ

హనుమకొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

– రెండో విడత పోలింగ్ 87.25 కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో గ్రామపంచాయతీలకు రెండో విడతలో సర్పం చ్, వార్డు స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నిక లు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.జిల్లాలో రెండో విడతలో ధర్మసాగర్,…

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు స‌హాయం

– న‌ష్టం వాటిల్ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డ‌తాం -ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హామీ వ‌రంగ‌ల్, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధిత కుటుంబాలకు  స్థానిక  శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వరదల…

న్యాయ‌బ‌ద్ధంగా ఓటింగ్ జ‌ర‌గాలి

– ఓట్ చోరీపై రాష్ట్రంలో సంత‌కాల సేక‌ర‌ణ‌ -మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయ‌న దిల్లీ వెళ్లారు. ప్ర‌యాణానికి ముందు ఆయ‌న…

ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి

మునుగోడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : గ్రామ సర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయాన‌ని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడో అభ్య‌ర్థి. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన చెనగొని కాటంరాజు (45) ఈనెల…

డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ఎన్‌ఈడబ్ల్యు), మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు సంయుక్తంగా ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించారు. ఎండీఎంఏ(డ్రగ్స్‌) విక్రయిస్తున్న పెడ్లర్‌ ఒకరు, ఇద్దరు సబ్‌-పెడ్లర్లను వారు అరెస్టు చేశారు.…

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ సందర్శించిన ఎంపీ రఘునందన్‌

– త్వరలో స్టేషన్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా కొమురవెల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లోనే రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని…

ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం

– 12 మందిపై సస్పెన్షన్ వేటు  చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలైన బ్యాలెట్‌ పేపర్లు శుక్రవారం మురుగు కాలువలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన 12 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఇలా…

భద్రాద్రిలో 20నుండి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

– 29న గోదావరిలో తెప్పోత్సవం – 30న ఉత్తర ద్వార దర్శనం – ఉత్సవాలకు ముమ్మ‌రంగా  ఏర్పాట్లు   భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి జనవరి 9వతేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  9వ…

ఫుడ్ పాయిజనింగ్‌పై బాలల కమిషన్ సీరియస్‌

– హాస్టల్ భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీ – విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : నగరంలోని బాగ్ లింగంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది.  కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్…