Category ప్రత్యేక వ్యాసాలు

పథకాలు ప్రకటించటంలో ఉన్న ఆరాటం అమలులో ఏది..?

ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ.. ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్నారు. గత ఏడాది దళిత బంధు పథకం ప్రకటించి, లక్షలో ఒక్కరి, ఇద్దరికి ఇచ్చి, దాని ఉసే మరిచారు. గత నెల రోజుల క్రితం అతి గొప్పగా బిసి కుల వృత్తులకు రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకానీ ప్రకటించారు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకాని కేసీఆర్ పునాదులు వేశాడు. కానీ సంక్షేమ పథకాలు ప్రకటించిన అంత వేగంగా, ఆ పథకాల అమలు లేకపోవడం చూస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పథకాలు అమలు చేయాలన్న చిత్త శుద్ధి ఉందా..? అన్న సందేహం కలుగుతుంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అతి గొప్పగా ప్రకటిస్తూ.. దళితుల్లో ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధి అయిన, ప్రభుత్వ ఉద్యోగైనా, వ్యాపారస్తుడైనా, భూమి ఉన్నా సరే, ప్రతి దళితునికి రూ.10 లక్షల నగదు బంధు ఇస్తానని ప్రకటించారు. అన్న విధంగానే కోటికో నూటికో ఒకరి, ఇద్దరికి తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చి ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ఆగ మేఘాల మీద బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష రూపాయల బంధు ప్రకటించినట్లుగానే, గత రెండు రోజుల క్రితం మైనార్టీలకు మైనార్టీ బంధును కూడా ఇస్తానన్న ప్రకటన రానే వచ్చింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇప్పుడే దళితులు, గిరిజనులు, బిసి, మైనార్టీలు గుర్తుకు రావడంపై  అనేక సందేశాలు కలుగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపు మాపడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే, కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తుంది. నిజానికి దళితుల్లో నూటికి 90 శాతంకు పైగా కడు బీదరికంలోనే ఉన్నారు. వారిని బీదరికం నుంచి బైట పడేయటానికి దళిత బంధు తేవడం హర్షణీయమే, కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని చూస్తుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఏ పథకమైన ముందుగా ఎలాంటి అసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహిస్తారు. అందుకు భిన్నంగా దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగస్తులు, తమ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చుకున్నారు. అంటే ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమతో పెట్టిన పథకం కాదన్న మాట.! ఓట్ల కోసం పెట్టిన పథకం అన్న మాట.! ప్రతి దళితుడికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అపోహలు, సందేహాలు లేవు కానీ, ముందుగా కడు బీదరికంలో ఉండి, ఎలాంటి ఆసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహించాలి. అందరికి ఇస్తాను అని అనడంలోనే కేసీఆర్ చిత్త శుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. అంటే ఒక్కరి, ఇద్దరికి రూ.10 లక్షలు ఇచ్చి, యావత్ దళిత సమాజాన్ని మోసం చేయలని కేసీఆర్ కుట్ర పన్నినట్లుగా ఉంది. ఇదే తరహాలో బిసి కుల వృతి దారులకు, మైనార్టీలకు రూ.లక్ష రూపాయల పథకం ఊరికి ఒక్కరు, ఇద్దరికి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఉంది. గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలు ప్రకటించి, నేడు వాటి ఊసే ఎత్తడం లేదు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి జాబితాలో  దళిత, బిసి, మైనార్టీ బంధు పథకాలు చేరుతాయన్న సందేశం కలుగుతుంది. బిసి బంధు ప్రకటించిన నెల రోజుల తరువాత విధి విధానాలు ప్రకటించి, దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజుల గడువు ఇవ్వడం ఏమిటి..? అంటే ఎవరు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉండకూడదని అనుకున్నారేమో..? అందుకే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజు గడువు ఇచ్చినట్లు ఉన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి దరఖాస్తుదారుడు కుల, ఆదాయ, ధృవ పత్రాలతో పాటు  రేషన్ కార్డు జత చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ లేనే లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కుల ధృవీకరణ పత్రం జారికి ఒక నెల గడువు, ఆదాయ ధృవీకరణ పత్రాల జారికి వారం రోజుల గడువు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పది రోజుల గడువులో బిసి కుల వృత్తి దారులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు. బిసి కుల వృత్తులు చేసుకునే వారిలో, మైనార్టీలలో అత్యధికులు నిరక్షరాశులు ఉంటారు. ప్రభుత్వం సూచించిన విధంగా వారం రోజులో ధృవ పత్రాలను పొంది, ఎలా దరఖాస్తు చేసుకుంటారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వానికి బిసి కులాలను మోసం చేయడం కోసమే, బిసి బంధు తెచ్చినట్లు కనిపిస్తుంది. బిసి బంధు ప్రకటనతో లక్షలాది మంది వారం రోజుల పాటు ఏంఅర్ఓ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన చాలా మంది కుల, ఆదాయ ధృవ పత్రాలు సాధించలేక పోయారు. ఇదే అదునుగా ఏంఅర్ఓ కార్యాలయ సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అందిన కాడికి దండుకొని కావలసిన వారికి ధృవ పత్రాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రకటిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందేలా విధి విధానాలను రూపకల్పన చేస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో చిత్త శుద్ధి లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికే సమయం ఇవ్వని ప్రభుత్వం అర్హులైన బిసి కులాలకు రూ.లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని నమ్మాలి. దళిత బంధు, బిసి కుల వృత్తులకు ఇచ్చే రూ.లక్ష రూపాయల సహాయం పథకం  మాదిరిగానే మైనార్టీ బంధు పథకం కూడా ప్రకటనలకే పరిమితం కానున్నట్లు ఉంది. దీనిని బట్టి చూస్తే, కేసీఆర్ మరోసారి ఓట్ల కోసం ఆగ మేఘాల మీద తీసుకువచ్చిన పథకాలు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదన్న సంగతి తేటతెల్లం అవుతున్నది.    బొల్లంపల్లి ఆంజనేయులు 9000099152

వాతావరణ మార్పు… జీవులపై దాని ప్రభావం

సాధారణ వాడుకలో, వాతావరణ మార్పు గ్లోబల్‌ ‌వార్మింగ్‌-‌గ్లోబల్‌ ‌సగటు ఉష్ణోగ్రతలో కొనసాగుతున్న పెరుగుదల-మరియు భూమి  వాతావరణ వ్యవస్థపై దాని ప్రభావాలను వివరిస్తుంది. వాతావరణ మార్పు అనేది కాలక్రమేణా భూమి  వాతావరణ నమూనాల దీర్ఘకాలిక మార్పును సూచిస్తుంది. ఇది ప్రపంచ లేదా ప్రాంతీయ స్థాయిలో ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నమూనాలు మరియు వాతావరణ వ్యవస్థలోని ఇతర అంశాలలో…

ప్రశ్నించడమే పాపమా?

ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి. సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్‌ ఇం‌టర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే…

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠం 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటు వుండేది.60 ఏo డ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో  విద్యుత్ ప్లాంట్లు…

పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సఫలీకృతమేనా …

ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థుల సామాజిక సమ భావన వృద్ధి చేయడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వ బడులను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ పౌష్టికార పథకం కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి నియమావళి…

వరదలు సరి.. ఆ తరువాత మరి..

ఉత్తర భారత దేశంలో వరదలు విలయతాండవం చేశాయి. దక్షిణంలో తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.ఇక్కడ కూడా కూడా వరదలు రావడానికి అవకాశం ఉంది.వరదల సమయంలో ప్రభుత్వాలు శక్తికి మించి తీసుకున్న చర్యలు ఫలితంగా చాలావరకు ప్రాణ, ఆస్థి నష్టాలు తగ్గాయి . ఐతే వరదల తరువాత కూడా చాలా సమస్యలు తీవ్రమవుతాయి. వరద సమయం లో…

పల్లె, పట్టణ ప్రగతి వల్లే స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌లో నేడు తెలంగాణ టాప్‌

కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మం త్రిత్వ శాఖ 2016 నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌, ‌ప్రపం చంలోనే అతిపెద్ద పట్టణ పారి శుధ్యం, పరిశుభ్రత సర్వే. పట్టణాలు, నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంలో, పౌరులకు వారి సర్వీస్‌ ‌డెలివరీని మెరుగుపరచడానికి, పరిశుభ్రమైన నగరాలను రూపొందించడంలో ఇది కీలకమైనది. స్వచ్ఛ సర్వేక్షణ్‌…

ధాన్యం ఎగుమతులపై నిషేధం ఎందుకు ?

మన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ ఎప్పటినుంచో గగ్గోలు పెడుతోంది. ధాన్యం కొనుగోళ్లపై నియంత్రణ ఎత్తేయాలని కోరుతోంది. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. తాజాగా బియ్యం  ఎగుమతుల పై ఆంక్షలు విధించడంతో అక్కడ బియ్యం నో స్టాక్‌ ‌బోర్డులు దర్శనమిస్తున్నాయి.మరోవైపు ధాన్యం ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం…

తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ  అంటే  కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి నాయకులకు ఒక విధమైన అసూయ ఎందుకంటే ఈ ప్రాంతం ప్రకృతి వనరులతో ఖనిజాలతో సుసంపన్నంగా విరాజిల్లుతున్నది. ఇక్కడ  పచ్చటి పంట పోలలాతో కాలేశ్వరం జల గంగతో  సాగు త్రాగునీటి తో సుభిక్షంగా ఉండడమే వీరికి మింగుడు పడడం లేదు. ప్రకృతి సంపదలు ఎంతగా ఉన్నా పారిశ్రామికంగా, విద్య, వైద్య,  రోడ్డు, రైలు రవాణా మొదలగు రంగాలలో విషయాలలో ప్రజలకు అవసరాలు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి‌ దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయ సౌకర్యాలు అవసరం మరియు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా తెలంగాణ దేశంలోని 29వ రాష్ట్రం. కానీ ప్రధానమంత్రి మోడీ తెలంగాణ మీద ఒక విధమైన కక్ష సాధింపు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కావడమే  అసలు బిజేపికి ఇష్టం లేదు. ప్రధాని మోడీ  తెలంగాణకు వచ్చిన ప్రతిసారి మోసపూరిత  మాటలు స్పష్టంగా ప్రజలకు అర్ధమైపోతున్నవి. నిజాలు బిజేపి నేతలు మాట్లాడలేరు. కనీసం చెప్పే అబద్దాలు కూడా నమ్మశక్యంగా లేవు.  కొత్త రాష్ట్రం తెలంగాణ సాధించుకొని, అరవైఏళ్లపోరాటం ఫలించి, నవ శకానికి నాంది వేస్తున్న తరుణంల తెలంగాణను  అభినందించవలసిన ప్రధాని మోడీ, తల్లిని చంపి బిడ్డను బతికించారని తన మనసులోని మాటను వెల్లగక్కినాడు.  శుభం పలకమంటే ఏదో పలికినట్లు ఉన్నది తెలంగాణ ఏర్పాటైన రోజు నుండి  ప్రతి అవకాశాన్ని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేందుకు ఉపయోగించుకొనే మోడీకి తెలంగాణ పట్ల ఆదరణ చూపడం లేదు అందుకే ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన ఉండదు. ఎప్పుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు. రాష్ట్ర బిజేపి నాయకులకు ఈ విషయం అర్ధం కావడం లేదు. మోడీ మాయలో  బిజేపి నాయకులు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి  ఒకప్పటి ఆరాధ్యుడైన లాల్ కృష్ణ అద్వానీ కూడా తెలంగాణ పట్ల చివరి ప్రయత్నం గా రాజధాని ఉన్న ప్రాంతానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకని  తన వ్యతిరేకతను తెలియజేసినాడు . మన  భారత దేశంలో పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి. కాని సంపన్న వర్గాలకు  కొమ్ము కాచే నాయకత్వం పేదలను ఆదుకుంటారని నమ్మడం కష్టతరమైన విషయం. దేశంలో గత ప్రభుత్వాలు అనేక స్పీడ్‌రైళ్లను ప్రవేశపెట్టారు. దేశంలో పేదలకు కూడా సంపన్నులలాగా సౌకర్యాలు అందాలని గతంలో గరీభ్‌రధ్‌ రైలు ప్రవేశపెట్టారు. దేశమంతా ఈ రైళ్లు  ప్రజలందరికీ సేవలందిస్తున్నాయి.  వీటిని ఒకేసారి ప్రవేశపెట్టినారు. ప్రస్తుతం వందేభారత్‌ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్ల అన్నింటిని  ప్రధాన మంత్రి మోడీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించినారు.  రైల్వే శాఖ క్యాబినెట్ మంత్రి లేదా సహాయ మంత్రి ప్రారంభించవలసిన రైళ్లను దేశ ప్రధాని ప్రారంభించడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.  భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి తిరుపతి వెంకన్నసన్నిధికి వందేభారత్‌తో అనుసంధానం చేస్తున్నామని పెద్ద హాస్యాస్పదంగా ఉన్నది. ఇంతవరకు తిరుపతికి హైదరాబాద్‌ నుంచి రైల్వే లైన్ లేనట్లు  ఇప్పుడే క్రొత్తగా లైన్‌ వేసి  రైళ్ళు నడుపుతున్నట్లు చెప్పుకోవడం ప్రజలు వింతగా చూస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలు తెలంగాణ ప్రజలకు కోసం వేసింది కాదు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే. ఈ వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ తెలంగాణలో ఒక్క నల్గగొండ  మీదుగానే ప్రయాణం చేస్తుంది. అది దాటితే మొత్తం ఆంధ్రాలోనే ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్‌, సిర్పూర్, ఖమ్మం , వికారాబాద్ ప్రాంత ప్రజలు వందేభారత్‌ రైలులో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్‌కు రావలసి ఉంటుంది. కాజీపేట, వరంగల్‌ మీదుగా ఈ రైలు నడిపిస్తే  కొంతలో కొంత తెలంగాణుకు మేలు జరిగేది. కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చాలావరకు ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చి ప్రజలపై అధిక భారం మోపుతున్నారు ఇంతేగాక అనేక హాల్ట్ లను ఎత్తివేసి ప్రయాణికులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కాజీపేట బలహర్ష సెక్షన్   లో సింగరేణి, రామగిరి, నాగపూర్ ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైలులుగా మార్చి పలు హాల్టులను రద్దు చేసినారు. ఫలితంగా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌  రైల్వే స్టేషన్‌ ను తీర్చిదిద్దే ప్రతిపాదన బిజేపి ప్రభుత్వానిది కాదు. గత కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించినదే .తెలంగాణ మీద మోడీ ప్రేమతో చేసిందే ఏమాత్రం కాదు. దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతోంది. ఇదేదో బిజెపి ప్రభుత్వం చేస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు శంకుస్ధాపన  పెద్ద నాటకం. అక్కడ భవనం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. ఓపి కూడా పనిచేస్తోంది.  ఇప్పటికే వైద్య సేవలు అందిస్తున్నది. కాకపోతే కేంద్రానికి, బిజేపి పార్టీకి హఠాత్తుగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ మీద ప్రేమ తెలంగాణ ప్రజల కోసం కాదు, అక్కడ ఉన్న భూములు ధరలు  పెంచుకొనడకోసం .  ఎయిమ్స్‌ స్దాయి దవఖానకు వెయ్యికోట్లు వెచ్చిస్తామని మాటలు చెప్పడం కాదు, ఎప్పటిలోగా అన్ని సౌకర్యాలు పూర్తి చేస్తారో చెప్పడం లేదు. రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెట్టమంటారు దీనికి వ్యతిరేకంగా రైతుల కోసం ఎంత దూరమైన వెళ్లి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టనని చెప్పడం మోడీకి నచ్చడం లెదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వేల కోట్లు విడుదల చేయకుండా ఆపినారు.…