Category Shoba

నిప్పుల త‌ప్పెట‌…

నిమ‌గ్న‌త‌తో, నిబ‌ద్ధ‌త‌తో నిష్క‌ర్ష‌గా తాను అర్థం చేసుకున్న సామాజిక విష‌యాన్ని క‌వితాత్మ‌కం చేయ‌గ‌లిగిన శ‌క్తి క‌లిగిన క‌వి కృపాక‌ర్ మాదిగ‌. స‌మాజం నుండి ప్రాపంచిక‌త వైపు ఉద్విగ్నంగా సాగిన సామాజిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మ్మిళిత‌మైంది  ఆయ‌న క‌విత్వం. ద‌ళిత ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచి ఆలోచ‌నాత్మ‌క‌మైన ఎంతో సాహిత్యాన్ని ఆయ‌న అందించారు. ఉద్య‌మ సంద‌ర్భ‌మే కాదు విష‌య‌మేదైనా అద్భుతంగా,…

ద్వివాక్య కవిత్వం

మతి మాలిన మనుష్యులను గతి నిలబడనిస్తుందా పచ్చని పైరుకు రక్షణ ఇవ్వక పీడ నాశనం చేస్తుంది ఆవేశంతో అగ్గి రగిలించినా న్యాయాన్ని పొందగలమా కాలిన విత్తులు ఎన్ని విత్తినా చచ్చినా మొలలేవు సమయం తక్కువన్ని చదువులో చతికిలపడతారా పరుగుపందెంలో దూరముందనీ కూలబడతామా మీతి మీరిన ద్వేషం మనిషికీ చ్యుతినిస్తుందా ఆత్మలో విషం వున్నా బెల్లం తీపెలావుతుంది…

అనుభవం

మొన్న … బాల్యంలో అమ్మ ఒడిలో పడుకొని చుక్కలు చూస్తూ అనుకుంటారు ఏ అమ్మ ఆకాశంలో చుక్కలు పెట్టి ముగ్గు వేయడం మరిచిందో అని నిన్న … యవ్వనంలో పిల్ల గాలిని ఆస్వాదిస్తూ చుక్కలు చూస్తూ అనుకుంటారు ఈ చుక్కలాంటి అమ్మాయి తన పక్కనుండాలని . నేడు …. వృద్ధాప్యంలో ఒంటరి నిశీధిలో చుక్కలు చూస్తూ…

వెళ్లి రావమ్మా..బతుకమ్మా!

Saddula Bathukamma celebrations in the city today

బతుకమ్మ…బతుకమ్మా మా కంటి వెలుగువు నీవు మా ఇంటి ఇలవేలుపు నీవు మా గుండెల సవ్వడి నీవమ్మా మా బతుకు మెతుకు నీవమ్మా తెలంగాణ జయహారతి నీకమ్మా   పుడమి పూల సింగిడి నీవు అతివ పూజల సందడి నీవు పల్లెపట్టణాల సంబురం నీవు శ్రమజీవన సౌందర్యం నీవమ్మా సకల జనుల సన్నతి నీకమ్మా  …

నారింజ రంగు సాయంత్రాలు

అస్తమిస్తున్న సూర్యున్ని నుదుట కౌగిలించుకొని ఆమె వాకిట్లోకొచ్చింది భూమికి నారింజరంగు చల్లినట్లుంది అరచేతిలో ఆ సాయంత్రాన్ని పట్టుకొని తడిమట్టిపై సంధ్యవనంలోకి మరలి బంగారు చారల ఆకాశం కింద అతని వెనకాలే నిల్చుంది! అతని కళ్ళల్లో సముద్రం కదిలింది శబ్దాలకతీతమైన పడవపై మసక వెన్నెలను తాగుతూ ఆ కిటికీలోంచి ఆవలకు కనుమరుగైంది ఆమె గుప్పిట్లోంచి వదలబడిన సాయంత్రం…

ఎవరిది తప్పు?

పారే నీటిని దాచుకోని నదీ గర్భం వెల్లువని ప్రక్క దారి పట్టించిన మెరక దర్పం! అదను చూసి జెండా పాతేసిని కబ్జాదారులు జేబు తడుపుకు సరిహద్దులు మార్చిన అధికారులు!     లేని దానికి సదుపాయాలిచ్చిన ప్రభుత్వవిభాగం కాని దానికి పన్నులు దండుకున్న పాలక పక్షం! మాయాగృహం చూపి మంత్రం వేసిన గుత్తేదారు భ్రమలు చూపి…

బూడిద రంగు ఆకాశం

భూమిని తొడిగిన మొక్క ఒక దిగ్దర్శనం విలోమానుపాతంగా విలీనం అంచుల్లో ఒకే రంగు కల పొదిగి పొదిగి వెచ్చని గడ్డిలోంచి అనేకానేక వర్ణపు రెక్కలతో బూడిదరంగు ఆకాశంలోకి అనంతాస్పృశ్యం అసాధారణ మానసికం జారుడు పదార్థంలోంచి పక్కున పగిలి ఉదారంగు గుడ్డుగా దొర్లినా మొన్న మిగిలిన మాటల గీతలు ఏ కోణమానినిలో పొసగక విఫలయత్నం కార్చిచ్చుల కాలిబాట…

జీవ‌న ల‌య‌ల స‌వ్వ‌డులు…

Studying the rhythms of life

ఆలోచ‌న‌ల్లోని నిర్మ‌ల‌త్వంలా, నిర్మాణంలో నిపుణ‌త‌లా, అనుభూతుల పాల‌వెల్లిలా క‌విత్వం ఉండాలంటారు. జ‌ల‌పాత స‌దృశంగా మినీక‌విత‌, నిశ్చ‌ల స‌ర‌స్సులా హైకూ ఎంతో నిదానంగా మొదులై గుండెలోని అణువ‌ణువునూ త‌డ‌ముతూ ప్ర‌వ‌హించి చైత‌న్య ఝ‌రిగా నిలిచిపోయే నానీలు ఆధునిక వ‌చ‌న క‌విత్వ ప్ర‌క్రియ‌లు. వ‌స్తువుకు సంబంధించిన ష‌ర‌తులేవీ లేకుండా నాలుగు పాదాల్లో స్వేచ్చ‌గా శిల్పాన్ని, స‌ముగ్ర‌త‌ను పాటిస్తూ అభివ్య‌క్తిని…