ప్రభాత వెలుగులకై…
ఓ వోటరన్నా! మళ్లీ వోట్ల పండగ వచ్చేసిందిగా. మమతల మధురిమలు కురిపిస్తూ మాటల మధువుల్లో ముంచెత్తుతూ వలపు పిలుపులతో మురిపించి మైమరిపించి, మనసుదోచే మమతల మాలికలల్లే రాజకీయ మాయలోళ్లు గడప గడపకు వచ్చేస్తున్నారు జాగ్రత్త…జర జాగ్రత్త. ఆచరణలో ఆకృతులన్నీ వికృతరూపాలైనా మాటలలో సుందరస్వప్నాలు ఒలకపోసి, నీ మనసుని ఆశల గేలానికి చిక్కించి, నీ కనుల లోగిళ్ళలో…
