Category సాహిత్యం-శోభ

ఆషాఢ మాసం

ఆషాఢ మాసం వచ్చేసింది వాతావరణంలో మార్పులన్నీ తెచ్చేసింది నీటి మార్పులు తెస్తుంది జీర్ణశక్తిని మందగింప జేస్తుంది కఫం ఇబ్బంది పెడుతుంది పేలాలే దానికి నివారణ అంటుంది పోషకాల మునగాకు వేడి గలది ఈ కాలంలో తింటే చల్ల బరుస్తుంది దక్షిణాయనం ఆరంభమౌతుంది పితృదేవతలకు ఇష్టమైన కాలం ఇది దానాలు చేసేందుకు అనువైనది గొడుగు, చెప్పులు దానం…

అమ్మా…

ఏడాది గడిచే పోయింది.ఏడ పోయిందో నా తల్లితొలిసూరు కాన్పులోనేఏం తొంద రొచ్చిందనోఅసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మఎండకి ఎండిపోతాననివానకు ముద్దయితా ననేమోనులి వెచ్చని మాసంలోపురుడు పోసుకొని నను కనింది నాతల్లికృష్ణమ్మ ఒడి నుండిగోదారి తీరానికిపొత్తిళ్ళలో నను పొదివి పట్టినాన్న తో నడిచొచ్చిందివెన్న ముద్దుల్లోంచివెన్నెల కురిసే వెలివాడనుంచిదండ కారణ్యం లోనికినన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసంనీ కోసమే…

వోటరు ‘‘పవర్‌’’

ఎన్నికల సైరన్‌ ‌మోగకనే పొలిటికల్‌ ‌నేత గణాలు తెగ సందడి చేస్తున్నాయ్‌ ‌బహురూపుల వేశంగట్టి వోట్ల వేటకు కదిలినయ్‌ ‌కపట నాటక ప్రదర్శనతో కట్టు కథలు చెప్తున్నాయ్‌ ‌ప్రజలే దేవుళ్ళు అంటూ గొంతెత్తి నినదిస్తున్నాయ్‌ అసత్యపు ప్రచారాలతో సభల జోరెత్తిస్తున్నాయ్‌ అభివృద్ధి మంత్ర జపంతో దొంగ దీక్ష సాగిస్తున్నాయ్‌ ‌పార్టీల జెండాలు ఎత్తుకు వీధుల్లో సంచరిస్తున్నయ్‌…

ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం…

పరమాత్ముని తత్త్వాన్ని  ప్రబోధించడమే  ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్‌ ‌చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా  క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన…

పైశాచిక కదనకాండ

మాస్కో మూకల పైశాచిక దాడుల్లో.. గాల్లో కలిసిన లక్షల జవాన్ల ప్రాణాలు వేలల్లో శ్వాస విడిచిన సామాన్య జనాలు లక్షల్లో నిరాశ్రయులైన అభాగ్యుల ఆక్రందనలు పైశాచిక కదనకాండకు నిలువెల్లా చిధ్రమై.. విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌ ఆవాసాలు ! బతుకు పంటల్ని పండించుకోవాలని.. తపించే సామాన్యుల కలల్ని కాలరాసి.. హరిత కోక కట్టుకున్న భూమాతని.. నెత్తుటి గాయాల జీవచ్ఛవంగా…

ఋతుపవనాలు

రైతు కళ్లలో ఆశల హరివిల్లు మెరవటం గీష్మ ఋతువులో మృగశిర కార్తె ప్రవేశించటం అరేబియా మహాసముద్రంలో బిపర్ర తుఫాన్‌ ఏర్పడటం అనుకోని అతిధిలా కేరళను తాకటం శుభసూచికంగా అన్నదాతలు భావించటం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టటం ఏడాదాంతా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని కోరుకోవటం ఏరువాకా ఆనందంగా సాగటం బువ్వపూలు పూయించాలానే కోర్కె నెరవేరాలని ప్రయత్నించటం…

మేలుకొలువు

ఇక్కడ దేశ చట్ట సభలు శిలా విగ్రహాలౌతున్నాయ్‌ ‌ప్రజాస్వామ్య విలువలు పట్టుతప్పి పోతున్నాయ్‌ ‌రాజ్యాంగ స్పూర్తులు కనుమరుగవుతున్నాయ్‌జి సిద్ధాంత శూన్య పార్టీలు ఊరూరా వెలుస్తున్నాయ్‌ ఎజెండా లేని జెండాలు నింగినంట ఎగుర్తున్నాయ్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్ ‌నిర్లజ్జగా చెల్లుతున్నాయ్‌ ‌స్వార్థ శక్తుల దుశ్చర్యలు బేసుగ్గా సాగుతున్నాయ్‌ ‌కుటిల నాయక మూకలు విద్రోహనికి తెగబడ్తున్నాయ్‌ ‌సమైక్య జనాల…

సాహితీ రథీ…దాశరథి

అక్షర యోధుడు అభినవ వ్యాసుడు అజ్ఞాత పోరాట ధీరుడు అభ్యుదయ కవి పుంగవుడు ఆయనే దాశరథి రంగాచార్య   ఇరవయ్యో శతాబ్ది సర్వత్రం సాహితీ సీమను ఏలినవాడు   నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం ఎత్తినవాడు   వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరు చేసినవాడు   తెలంగాణ బతుకు చిత్రం అక్షర…