Category సాహిత్యం-శోభ

నెత్తుటి లేపనం!

నిజమే…. మన ప్రమేయం లేకుండానే ఏ మాత్రం తెలియకనే వయసు పెరిగి పోతోంది ! రోజూ రోజటిలా లేకున్నా నిన్నటి రోజులా అనిపించక కొత్తగా నేడు మనముందు తెర తీసి ఆవిష్కారమై నిన్నను మరిచేలా నేడు కొత్తగా అందంగా దర్షనమౌతోంది ! అవును నిజంగానే గడిపిన రోజులు పాత జ్ఞాపకాలు బాల్యపు స్మృతుల చెలిమెలు యవ్వన…

ఇంతేనా ?

ఇంతగా చదివిన ఇన్నాళ్ళకు గానీ జీవితానికి తెలియలేదు లోకమనే  పుస్తకాన్ని చదివి పరీక్ష వ్రాయాలని .. ఎవరిని అడిగినా జవాబు రాని ప్రశ్నలను ఒకరిని కాఫీ కొట్టడానికి వీలుకాని పోటీ ఒకటి ఉంటుందని విధి ఫలితాల్లో ఓటమిని చదువుకుంటూ మధ్య మధ్యలో గెలుపు బరువుగా మోయడం ఉంటుందని ఊహల అందం చేసే మోసం ఒంటరితనంతో ఇంతేగా…

అరణ్యరోదన..

ఒకప్పుడు అడవంటే భయం అడవిలో పులులుంటాయని సింహాలుంటాయని భయం! అడవిని చూస్తే పారి పోయేవారు లోనికి ప్రవేశం ఒక సాహసం కాలచక్రం గిర్రున తిరిగేసరికి మనుషులు విపరీతంగా పెరిగి అడవులు తరిగి భయం స్థానంలో జాలి చేరింది.. అడవిలో కలప వనరులు జంతుజాలం మనిషి కంటి కిందకు పంటి కిందకు కూడా రావటం లేదు.. మనిషి…

మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్‌ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…

కడలి తరంగం..

మగాడు శాస్త్రకారుడై అపుత్రస్య గతిర్నాస్తని విషం కక్కితే! ఆతడు నిరాదరించిన తల్లిదండ్రుల్ని ఆదరణతో గుండెలకు హత్తుకుని అపుత్రికస్య గతినాస్తని తిరగరాసింది! వంటింటి కుందేలు కమ్మని శాసిస్తే అంతరిక్షాన్నే అలవోగ్గా చుట్టి సత్తా చాటింది! అబలవని కించపరచబోతే అన్నిట్లో మగాళ్ళను మించి సబలనంది! ఏ రంగమైనా సరే.. ఆమె దిగనంత వరకే! ఆమె రంగప్రవేశం చేసిందా అతడి…

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

మణి దీపం

మహిళే కదిలింది మహిమే చూపింది మహిలోన ప్రగతికి బాటే తానైనది ధరణే ధన్యమయ్యింది పుడమే పులకించింది మీ పాదాల ప్రణమిల్లి మీ ఘనతనే చాటింది తొలికోడి కూత కన్నా యల కోయిల పాట కన్నా ముందే నిద్దుర లేచే మహిళే కదరా మిన్నా ఇలలో అందమైనది కళకే కళ తెచ్చింది వసుధకే ఒక వరమై వసంతాలు…

ఓ రాహీ…రుక్‌ జానా నహీ !

మనిషంటేనే ఒక లయగతిక ప్రతీక జీవితమంటేనే చలనశీలం దేహం కదులుతుంటేనే ప్రాణం కాపురం చేస్తున్నట్టు ఊపిరుంటేనే ఉనికికి చిరునామా నడక మనిషి శ్వాస ఆగక నడవడమే మన అస్తిత్వం పయనం దారిలో పట్టుతప్పి ఎదురు దెబ్బలెన్ని తగిలినా పడిపోకుండా సాగటమే జీవితం నడకలేని మనిషి జీవితం ఎపుడైనా ఊహించగలమా? తప్పటడుగులతో మొదలై బుడి బుడి నడకలుగా…