Category జాతీయం

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు కిషన్‌ రెడ్డి శుభాకాంక్షలు

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన మీ జీవితం స్ఫూర్తిదాయకం అని…

భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

– ఉప ఎన్నికలో ఎన్డీయేదే గెలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థే గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డిపై రాధాకృష్ణన్‌ 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దిల్లీలో మంగళవారం ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం…

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక

– ఎన్‌డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్‌..‘ఇం‌డీ’ కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌ ‌రెడ్డి – ఉదయం పది గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం – సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్‌ – 6 గంటల నుంచి వోట్ల లెక్కింపు.. వెంటనే ఫలితం ప్రకటన న్యూదిల్లీ,సెప్టెంబర్‌8: ‌జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌రాజీనామాతో ఖాలీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది.…

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్‌, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్‌జిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార…

కార్గో రోప్‌వే తెగి ఆరుగురి మృతి

– గుజరాత్‌లో ప్రమాదం గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 6: గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో శక్తి పీఠమైన పావగఢ్‌ కొండ ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం గూడ్స్‌ రోప్‌వే వైర్‌ తెగి ఆరుగురు మృతిచెందారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక…

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించాకే శ్లాబులు

~ జీఎస్టీ శ్లాబులపై నిర్మలా సీతారామన్‌ ‌వివరణ ~ ధరలు దిగివొచ్చి సామాన్యులకు మేలు చేస్తుందని వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌ఇప్ప‌టివ‌ర‌కు జీఎస్టీ శ్లాబులు 5, 12,18, 28 శాతంగా ఉండేవ‌ని, అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ శ్లాబుల విధానం బిజెపి నిర్ణయం కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీసుకున్నదని కేంద్ర ఆర్థిక…

పాక్‌లో అట్టహాసంగా వినాయక నిమజ్జనాలు

కరాచీ,సెప్టెంబర్‌ 6: మన దేశంలోనే కాదు.. పాకిస్థాన్‌ ‌లో కూడా కొందరు హిందువులు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు.. వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం భారీ వినాయక విగ్రహాన్ని ఓ ఆటోలో పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు  ఆ…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మూడ్రోజుల్లో ముగియలేదు

– ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆసక్తిక వ్యాఖ్యలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టడం, ముగించడంపై ఆర్మీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ అం‌దరూ అనుకున్నట్లు మూడు రోజుల్లోనే ముగిసిపోలేదని, చాలా రోజులు కొనసాగిందని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.…

‌దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు ప‌డ్డారు

– కోటి రూపాయల కలశం తస్కరణ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ‌దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు పడ్డారు. ఏకంగా కోటి విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది.…