Category జాతీయం

అమెరికా విమాన వాహక నౌక అబ్రహాం లింకన్‌పై దాడి

– ప్రకటించిన ఇరాన్‌ – ఖండించిన‌ అమెరికా టెహ్రాన్‌,‌ మార్చి 13: అమెరికా విమాన వాహకనౌక అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్‌ ‌ప్రకటించింది. తమ బాలిస్టిక్‌ ‌క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ ‌జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను…

దేశంలో గ్యాస్‌ ‌కొరత లేదు

– ప్యానిక్‌ ‌బుకింగ్స్ అవసరం లేదు – కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ న్యూదిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ’ప్యానిక్‌ ‌బుకింగ్‌’ అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా…

అసోంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు

– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ – కామాఖ్య-చర్లపల్లి అమృత్‌ ‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభం గువాహటి, మార్చి1 3: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారం కోకరాఝార్‌లోని బహిరంగ సభలో…

యుధ్ద సంక్షోభంలో భారత్‌ ‌తొలి విజయం

– హర్మూజ్‌ ‌జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక – క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్‌ – ఇరాన్‌ ‌పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో…

మన విదేశాంగ విధానం అమెరికాకు తాక‌ట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి? – ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం – లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధీ ఘాటు విమర్శలు న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని…

తిరిగి స్పీకర్‌ ‌స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన -నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తిరిగి స్పీకర్‌ ‌స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ…

ఇం‌ధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నాం

– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్‌ ‌చర్చలు – విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామ‌ని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ‌మాట్లాడారని రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌వెల్లడించారు. హర్మూజ్ ‌మీదుగా భారత్‌కు…

కాశ్మీర్‌ ‌మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా -తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్‌ ‌సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు…

న్యాయవ్యవస్థలో అవినీతి రచయితలు

– వారిని దూరంపెట్టాలన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 12: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను…