Category ఎడిటోరియల్

కూల్చివేతల లొల్లి..!

కూల్చివేతల్లో ఎవరి ఘనత ఏమిటన్న విషయంపైన దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఒక వైపు దేశంలో అత్యున్నత చట్టసభ  పార్లమెంట్‌ ‌సమావేశాలు, మరోవైపున  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ఆయా రాజకీయ పార్టీల విధానాలను తెలిపేవిగా ఉన్నాయి.  ముఖ్యంగా కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌నేడు పాలన సాగిస్తున్న…

రాజ్‌భవన్‌ ‌నోట… ప్రగతి భవన్‌ ‌మాట

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలమేరకు రాజ్‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడిందనేందుకు శుక్రవారం రాష్ట్ర శాసన సభ,మండలి  బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసం లో  గవర్నర్‌ ‌తమిళిసై సౌందరాజన్‌ ‌ప్రసంగం చెప్పకనే చెబుతోంది. ప్రసంగ పాఠాన్ని క్రితం రోజున్నే రాజభవన్‌ ‌వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం, అందులో ఒకటిరెండు చిన్న సవరణతో గవర్నర్‌ ‌సంతృప్తిని…

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్‌ ‌కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌…

ఇకనైనా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు మెరుగు పడుతాయా !

చాలాకాలంగా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు దూరమవుతున్న విషయం తెలియందికాదు. పాలనా విషయంలో అడుగడుగున ఎదురవుతున్న సమస్యలపై  ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. దానికి తోడు గవర్నర్‌- ‌ముఖ్యమంత్రి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలిప్పుడు  మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎవరి పరిధి ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు విశ్లేషించాల్సిన పరిస్థితులు…

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 317 జీ ఒ

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకోసం కొత్తగా తీసుకొచ్చిన 317 జీఒ  పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ జీఒ  కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం  అవుతున్నాయంటూ పలువురు ఆందోళన బాట బట్టారు. రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు  కోసం ప్రభుత్వం ఈ జీఒ జారీ చేసింది.. అందులో…

ఫలించిన మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ ‌రావు ఠాక్రే  మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం…

ఎవరిది రైతు ప్రభుత్వం..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారే తమదే అసలైన రైతు ప్రభుత్వమని కితాబిచ్చుకుంటున్నాయి. దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ వారికోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాల చేతలుమాత్రం రైతులు ఉద్యమించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామన్న మిషతో కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ…

పాకిస్తాన్‌కు జ్ఞానోదయం ?

భారత్‌ ‌పక్కలో బల్లెంలా ఇంతకాలం వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు నిజంగానే జ్ఞానోదయం అయిందా అంటే ఆ దేశ ప్రధాని తాజాగా చేసిన ప్రకటన అక్కడి రాజకీయ నేతల దృక్పథంలో కొంత మార్పును సూచిస్తున్నట్లుగా ఉంది. తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవల దుబాయ్‌కు చెందిన…

బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి.  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత…