Category ఎడిటోరియల్

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని,…

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి…

ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఎం‌ట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో  ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌లో మొదలైన రాజీనామాల పర్వం

టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారినప్పటి నుండీ దేశంలోని భిన్న ప్రాంతాల నుండి అనేక మంది ఆ పార్టీలో చేరడానికి ఆతసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి స్వయంగా విచ్చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నవారు కొందరైతే, తమ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా కోరుతున్నవారు మరికొందరు. దీంతో బిఆర్‌ఎస్‌ ‌జాతీయ స్థాయిలో విస్తృతిస్తుందనుకుంటే స్వరాష్ట్రంలోనే…

టిడిపి రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పు

తెలుగుదేశం పార్టీ తిరిగి రంగ ప్రవేశం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమయింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి  తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో టిడిపి ఇక్కడి ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు మూడున్నర దశాబ్ధాల కింద  ఎన్టీ రామారావు సారథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, కేవలం తొమ్మిది నెలల…

మరోసారి భయపెడుతున్న కొరోనా కొత్త వేరియంట్‌

‌కొరోనా కొత్త వేరియంట్‌ ‌మరోసారి ప్రపంచాన్ని భయపెడతున్నది. ముఖ్యంగా కొరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో బీఎఫ్‌-7 ‌పేర ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ ‌ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను సృష్టించేదిగా ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి వ్యాప్తి చెందుతుంది. రానున్న…

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…