Category Crime

ప్రేమ పెళ్లి.. పెద్దల నిరాకరణ

– ఆత్మహత్యాయత్నం.. యువకుడి   మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట పెద్దల నిరాకరణతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో చోటుచేసుకుంది. ముస్త్యాలకు చెందిన అనుముల రాకేశ్(30) కారు డ్రైవ‌ర్. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది.…

భార్యాపిల్లలను రోకలితో మోదిన తాగుబోతు

– భార్య, కుమారుడి మృతి – ప్రాణాపాయ స్థితిలో కూతురు ప్రణీత ఆమనగల్లు, ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధి పులిగోనిపల్లి తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న సభావట్ రాందాస్ అనే వ్యక్తి తన భార్య కవిత(29), కుమారుడు హర్షవర్ధన్(5), కూతురు…

గోదావరిలోకి దూకి తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

– కాపాడిన స్థానిక యువకులు, డిడిఆర్ఎఫ్ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : కుటుంబ కలహాలతో భద్రాచలం బ్రిడ్జిపై నుండి శనివారం తల్లి కుమారుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. గ‌మ‌నించిన స్థానికులు హటాహుటిన బ్రిడ్జి కిందకు వెళ్లి తల్లీకొడుకుల‌ను.కాపాడి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ…

మంటలు చెలరేగి కారు దగ్ధం

యాదాద్రి భువనగిరి, మార్చి 28: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన కారు యజమాని అప్రమత్తమై వాహనం ఆపి,…

కూకట్ పల్లిలో 352 కేజీల కుళ్లిన చికెన్

– సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ బృందం వెటర్నరీ ఆఫీసర్…

తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు

– పోలీసుల దర్యాప్తులో అంగీక‌రించిన నిందితురాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి25: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సాయంతో కుమార్తె చంపేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్‌నగర్‌ ‌పరిధి కౌకూర్‌ ‌భరత్‌నగర్‌లో జరిగింది. 10 నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనిపై జవహర్‌నగర్‌ ‌పీఎస్‌లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబ…

మల్టీ లెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం

-క్యూనెట్‌ ‌సంస్థ వ్యవహారాలపై సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: క్యూనెట్‌ ‌సంస్థ మల్టీలెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్‌ ‌సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారని పేర్కొన్నారు.…

‌డ్రగ్స్ ‌కేసులో కీలక పరిణామం

– నిందితులకు మూడు రోజుల పోలీస్‌ ‌కస్టడీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీస్‌ ‌కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో నిందితులుగా ఉన్న పైలెట్‌ ‌రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ ‌శర్మలను మూడు రోజుల పాటు పోలీస్‌…

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

– 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి21: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్కు  చెందిన బస్సు ఓవ‌ర్ టేక్‌ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా…