Category ముఖ్యాంశాలు

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

‌మందు పోయలేదు… పైసలు పంచలేదు…

రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా సీఎం కేసీఆర్‌ ‌పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ‌రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి…

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమం’’

అరాచకాలతో,అణచివేతతో తెల్లదొరలు భారతీయుల స్వేచ్ఛాకాంక్షను ఎంతో కాలం నిలువరించలేకపోయారు. సహనానికి కూడా హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయిన నాడు, అప్పటివరకు సహనమనే తెరలమాటునున్న ఆవేశం బద్దలై, ప్రళయంలా ముంచుకొస్తుంది. అలాంటి ప్రళయానికి నాంది పలికిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమ చరిత్రను ప్రతీ ఒక్కరూ సింహావలోకనం చేసుకోవాలి.క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని స్మరించుకోవడం మన కనీస బాధ్యత.స్వేచ్ఛ అనేది…

గద్దర్‌ అం‌త్యక్రియల్లో అపశ్రుతి..

తోపులాటలో సియాసత్‌ ‌మేనేజింగ్‌ ఎడిటర్‌  ‌జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ ‌మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌ప్రజా గాయకుడు గద్దర్‌ అం‌త్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆల్వాల్‌ ‌మహాబోధి స్కూల్‌ ‌కాంపౌండ్‌లో గద్ధర్‌ అం‌త్యక్రియలు అధికారిక లాంఛనాలతో..బౌద్ధ ఆచారం ప్రకారం జరిగాయి. అయితే.. కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో…

ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్‌ ‌పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు అర్పించారు.గద్దర్‌ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్‌ ‌కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ ‌తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

‘ఆకలి కేకల గానం ..’ ఆగిపోయింది ..!

అశ్రునయనాల తో గద్దర్‌ అం‌త్య క్రియలు .. జనసంద్రమైన ఎల్బీ స్టేడియం నివాళులర్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు, మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ,ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు గద్దర్‌ అమర్‌ ‌హై అంటూ ‘దద్దరిల్లిన ఎల్బీ స్టేడియ్నవందలాది వాహనాలలో తరలివచ్చిన అభిమానులు హైదరాబాద్‌/‌ముషీరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7:‌ప్రజా యుద్ధనౌక, విప్లవోద్యమ సాహిత్యకారుడు గద్దర్‌ అం‌త్యక్రియలు సోమవారం సాయంత్రం 7.30 గం…

శ్రీ‌వారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

తిరుమల,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ ‌రావు  దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ ‌దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ ‌రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ…