Category శీర్షికలు

సూర్య గమనం సంక్రాంతి

విష్ణుమూర్తి రాక్షసజాతిని అంతమొందించిన రోజు మకర సంక్రాంతి. తమను అనేకరకాలుగా హింసిస్తోన్న అసురుల చర్యలకు తాళలేక దేవతలు మొర పెట్టుకోగా, విష్ణుమూర్తి రాక్షసులను హతమార్చి మందరపర్వతం కింద పాతిపెట్టాడు. కనుకనే మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకుంటాం. అశుభాలు, అపజయాలను తుదముట్టించిన దినంగా భావిస్తారు. అందుకే ఉదయానే నదీస్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకుంటారు. నది గానీ చెరువు…

కామారెడ్డి అగ్ని కణాలు

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌మాయ ముసుగులో.. పంటలకు నిప్పు పెట్టే కుతంత్రాలు సాగుబడి చేతులు నరికే నీతులు నేలతల్లి నిశ్శబ్ద నినాదాలకే కాదు.. కామారెడ్డి రైతు రౌద్ర కంపనాలకు.. ప్రభుత్వ నిర్ణయాలు జడిసే రోజులు ! మట్టి సత్తువ సలసల మసిలి.. కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది కొలిమిలో కర్రు మొన ఎర్రగా కాలి.. నిరసన చురకల వాతలు…

‘‘‌భరత జాతి ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్టుడు’’

నేడు వివేకానందుని జయంతి భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటిచెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి, మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసం గి కుడు. వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన…

గుణపాఠం తప్పదు

నీ మురికి కంపు ఎత్తిపోసేది మేము నీ కుటిల కడుపుకు మెతుకు పెట్టేది మేము నీ చీకటి బతుక్కు దీపము పట్టేది మేము నీ నల్ల అంతస్తుకు పునాది వేసేది మేము నీ దోపిడీ సంపదకు కాపలా కాసేది మేము నీ రొచ్చు పీనుగకు పాడెను కట్టేది మేము డప్పుల కొట్టేది మేము నీ సర్వ…

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని తలుసుకున్నపుడల్లా ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే కండ్లల్ల నీళ్ళూరుతుంటై సూరెంబడి టపటపా రాలి వాకిలంత పొక్కిలి పడ్డట్టు మనసంతా పొక్కిలి పొక్కిలైతది నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు కన్నీళ్ళ వానకు పెయ్యంతా నానుతది ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే సాయితగాని ఇంటికాడ అంటూ సొంటని సల్లిన పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే గురుతొచ్చినపుడల్లా పగిలి…

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…

తెలంగాణ తొలి ఉద్యమ పూర్వాపరాలు

జనవరి 9… తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని…