Category శీర్షికలు

కూల్చివేతల లొల్లి..!

కూల్చివేతల్లో ఎవరి ఘనత ఏమిటన్న విషయంపైన దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఒక వైపు దేశంలో అత్యున్నత చట్టసభ  పార్లమెంట్‌ ‌సమావేశాలు, మరోవైపున  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ఆయా రాజకీయ పార్టీల విధానాలను తెలిపేవిగా ఉన్నాయి.  ముఖ్యంగా కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌నేడు పాలన సాగిస్తున్న…

అధికారానికి సోపానమవుతున్న పాదయాత్రలు

రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న పాదయాత్రలు ఆయా పార్టీల ఎన్నికల ప్రచార యాత్రలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి రేపోమాపో ఎన్నికలు జరుగనున్నాయా అన్నంత సందడిగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాల్లోని…

భూకంప ‘‘విపత్తు’’

భీకర భూకంపాల తాకిడితో తుర్కియో సిరియా దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయ్‌ ‌ప్రకృతి ఉత్పాత తీవ్రతకు ప్రాణాలు నేల రాళ్తున్నాయ్‌ ఎటు వైపు చూసినా.. గుట్టలుగా పోగైన శవాలు తెగిపడిన దేహ అంగాలు కుప్ప కూలిన భవనాలతో వల్లకాటిని తలపిస్తున్నాయ్‌ ‌శిధిలాల కింద చిక్కిన క్షతగాత్రుల అర్థనాదాలు గుండెలను పిండేస్తున్నాయ్‌ ‌వందల కొద్ది ప్రకంపనలతో జీవితాలు దగ్దమౌతున్నాయ్‌…

గృహ హింస నిరోధక చట్టం పై అవగాహన అవసరం

‘‘ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహ హింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి  శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహ హింస కిందకే వస్తుంది. ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు…

అభద్రత వలయంలో వయోవృద్ధ భారతం..!

‘‘‌భారతంలో 45 ఏండ్లు దాటిన జనాభాలో 6 శాతం ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారని తేలింది. పోషకాహార అభద్రత, వైద్య ఖర్చులు పెరగడం, ఆరోగ్య భీమా అవగాహన లోపించడం, రవాణా పరిమితులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్య ధోరిణి, ఆర్ధిక బలహీనత లాంటి కారణాలతో వృద్ధుల బతుకులు గాల్లో దీపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వయోవృద్ధుల జనాభాను కాపాడుకోవడానికి…

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి

అదానీ గ్రూపు అక్రమాలపై నిస్పక్షపాత దర్యాప్తు చేయించాలని గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల్లు ఉభయ పార్లమెంట్‌ ‌సభలను స్థంభింపజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించక మొండివైఖరి ప్రదర్శించదం దురదృష్టకరం. విచిత్రంగా ప్రభుత్వం వలే అదానీ గ్రూపు సంస్థలకు వేల కోట్ల ఋణాలు ఇచ్చిన తమ ఉదార వైఖరిని సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు కూడా తంటాలు పడుతున్నాయి.…

వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్‌ ‌రావాల్సిందే !

దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్‌ ‌దిగ్గజాలకు…

మేధావియువత రాజకీయాల్లోకి రావాల్సిందే !

‘‘అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాటంచేస్తున్న  యువతను ఉద్యోగ నియామకాలంటూ ఎన్నికలు రాబోయే ముందు నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమవుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున,503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే జూన్‌ ‌లో మెయిన్స్…

‘‘విచ్చుకుంటున్న వేయి పడగల స్వార్ధం’’

‘‘‌తాను మునిగిందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖ భావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా,సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు.అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను…