Category శీర్షికలు

రాజకీయ మకిలి

లంచం…అదో రోగం సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఆరాటపడే జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసేవారు మరికొందరు. సమకాలీన రాజకీయం తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో మకిలిపట్టిపోతోంది. డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని ఏ ఎండకాగొడుగు పడుతూ పబ్బంగడిపే మేకవన్నె పులుల నిజస్వరూపం…

ఆకలి కసి

నిర్లక్ష్య వృక్షపు నీడన.. విజయ హరితం ఎదగదు నిరాశ మబ్బులు కమ్మిన.. కనిపించవు ఆశల వెలుగులు ! కష్టాల చెమట చుక్కల్తో.. చిగురించు సుఖ మొలకలు చదువు పట్టాల పంట చేనులో.. పండును జీవన సాఫల్య రాసులు ! పేదోడి ఆకలి కసి కృషి.. వర్షింపజేయు అన్నామతాన్ని అక్షరాల్ని విశ్వసించే మనిషి.. విశ్వవిజేతై ధరించు కీర్తి…

ఏమీటీ రాజకీయం

బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం. మునుపెన్నడూ ఎరుగని మితిమీరిపోతున్న కుల మత రాజకీయ విద్వేషాలు. అధికారం కోసం  అలుపెరుగని ఆరాటము కలవలేని వారితో కలగలసి కపటపు నీచ రాజకీయం రాజకీయ రణరంగంలో రాణించని నాయకులు ఓట్ల కోసం నోట్లతో నాటకాలు బూటకము. బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం.…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…

పాక్‌ ‌ముసలి కన్నీరు

నెత్తురు తాగే వ్యాఘ్రం సాధుజీవి రూపమెత్తింది ప్రాణాల తోడేసే తోడేలు శాంతి మంత్రం వల్లిస్తుంది కత్తుల తెగదూసే కర్కశి మైత్రి హస్తం అందిస్తుంది విద్వేషం చిమ్మే కాలనాగు కరుణ రసము స్రవిస్తుంది తగవుకు తెగపడే ఉగ్రదేశం సామరస్యం స్వాగతిస్తుంది మూడు యుద్దాల తదుపరి గుణపాఠం నేర్చుకున్నామని పాక్‌ ‌కొత్త పాట పల్లవిస్తుంది ఇకపై శాంతియుత జీవనం…

నిర్వహణ లోపాలే విమాన ప్రమాదానికి కారణమా…?

(నేపాల్‌ ‌యతి ఏయిర్‌లైన్స్ ‌విమాన దుర్ఘటనలో తుద శ్వాస విడిచిన అమాయక ప్రయాణికులకు అశ్రు నివాళిగా) ఎత్తైన ఎవరెస్టు హిమగిరుల శ్రేణులు, భయానక లోయలు, ప్రకృతి అందాల విందులు, పర్వతారోహకుల సాహస గుంపులు, పర్యాటకుల సందడుల నడుమ నిత్యం నేపాల్‌ ‌విమానాశ్రయాలు నిండుకుండలను తలపిస్తుంటాయి. గత ఆదివారం రోజున 72 మంది ప్రయాణికులతో దిగడానికి సిద్ధంగా…

బిజెపి కార్యవర్గంలో చర్చకు రాని ప్రజా సమస్యలు..

బిజెపి మరోమారు ఎన్నికల శంఖారావం పూరించింది. 9 రాష్టాల్ల్రో విజయమే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా  తొమ్మది రాష్టాల్ర ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బిజెపి కార్యవర్గ సమావేశంలో ఈ రెండే అంశాలపైనే  ప్రధానంగా చర్చ సాగాయని…

గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, పట్టణాలలో  పుట్టగొడుగుల్లా  బెల్టు దుకాణాలు మద్యం ను విక్రయిస్తున్నాయి . మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతూ వున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా  ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో…

పంటల కొనుగోళ్లలో ఏటా తిప్పలే !

సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడడం..రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగడం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్తాయిలో ఆలోచన చేయడం లేదు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగడం లేదు.…