Category శీర్షికలు

భక్తుల కల్పతరువు నారసింహుడు

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి… నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే…

‌మోదీ పేదల దేవుడన్నా…!!

‘‘మోదీ పేదలపాలిటి దేవుడన్నా…’’, పేదలు ఇబ్బంది పడొద్దని బియ్యం ఇస్తున్నడన్నా…’’,  ‘‘అలాంటోన్ని ఎందుకు తిట్టాలన్నా..’’…. అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌మాటలను గుర్తుచేస్తున్నాయి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు.  ప్రధాని మోదీ నిజంగానే పేదలను ఆదుకునే దేవుడే అయితే పేదలపై ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు. మోదీ అధికారంలోకి వొచ్చిన…

ప్రైవేట్‌ ‌కళాశాలల్లో టార్చర్‌ ఈనాటిదా?

‘‘‌ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడుతాయని  రకరకాల అభిప్రాయాలతో  చేస్తూ ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ వాటి  స్థాయిని  ఆకాశానికి…

ఉ‌క్రయిన్‌-‌రష్యా యుద్ధం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా అగ్రరాజ్యం రష్యా దూకుడు ఆగడం లేదు, విశ్వానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన రష్యా ట్రాక్‌ ‌తప్పి మారణ హోమం చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది! మూడేళ్ళపాటు చిచ్చు లేపిన విశ్వకరోనా మహమ్మారి కొంచెం కొంచెం శాంతించిన తర్వాతనైనా ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సిన రష్యా యుద్దోన్మాదంతో సరికొత్తగా ఉరకలు వేస్తున్నది!…

‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి…

విద్యాలయాల్లో పెడధోరణలు

‘‘ ‌సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన…

బతకాలి

ఒక్క క్షణం… బ్రతుక్కి చావుకి నడుమ ఆగి ఆలోచించ గలిగితే నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం జీవితం మనిషికి మాత్రమే దొరికిన అపురూప వరం ఆవేశంలో, అనాలోచితంగా బాధల గుప్పిట నలిగిపోతూ అదృష్టంగా దొరికిన జీవితాన్ని  అర్ధాంతరంగా ముగించాలనుకోవటం అవివేకం కరువు కోరలకు చిక్కి పండిన పంటకు పెట్టుబడే రాక దళారీ దగాకు తల్లడిల్లి నూరేళ్ళ బ్రతుకును…

దేశపతి కి అవకాశం దక్కేనా ..?

మరో తొమ్మిది నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలకు ముందుగానే తమ బలాబలాలు తేల్చుకునే అవకాశం ఏర్పడింది. నేటికి సరిగ్గా 22 రోజుల్లో జరుగనున్న మినీ సంగ్రామంలో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఖాలీ  ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు గాను ఈ నెల…