Category శీర్షికలు

కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!

కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న  పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి…

జన హృదయ నేత వైయస్‌ఆర్‌

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను ఒంటి చేత్తో దరికి చేర్చిన…

‌నేడు అంతరిక్షం లోకి.. ఆదిత్య ఎల్‌ 1 ‌ప్రయోగం!

ప్రస్తుత పరిస్థితులలో సూర్యుని దగ్గరకు అంతరిక్ష వాహనాన్ని పంపించలేము. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రము.ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు మాత్రమే. అందుకే సూర్యుని పరిస్థితిని అధ్యయనం చేస్తే ఇతర నక్షత్రాల గుట్టు కూడా తెలుసుకోవచ్చు. 1868లో ఆగస్టు 18న సూర్యగ్రహణం సందర్భంగా జూల్స్ ‌జాన్సన్‌ అనే…

కాంగ్రెస్‌లో రెండు సీట్ల లొల్లి

రెండేసి సీట్ల కేటాయింపు విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇంకా అభ్యర్ధుల ఎంపికపైనే ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న క్రమంలోనే  తమతో పాటు తమ కుటుంబ సభ్యులకుకూడా స్థానం కేటాయించాలంటూ సీనియర్‌ నాయకులు చేస్తున్న ఒత్తిడి  తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నది. ఈ విషయం అధిష్టానం చూసుకుంటుందని స్థానిక నాయకత్వం చేతులు…

ముసుగులు

ముసుగులు చిత్ర విచిత్రాలు కనిపెట్టకపోతే కావచ్చు కన్నీటి పర్యంతం కొన్ని మనసులు దోచుకుంటే సంపదను, సర్వస్వాన్ని దోచుకునేవి మరికొన్ని మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి పక్క పక్కనే విభజన చేసి చూడకపోతే నష్టమే జోకర్‌ ‌ముసుగులు సర్కస్‌ అసెట్‌ ‌నవ్వినా, ఏడ్చినా ఉయ్యాలలూపుతాయి నవ్వుల్లో బుడ్డరఖాన్‌ ‌వేషాలు రక్తి కట్టిస్తాయి నాటకాన్ని తన్నులు తిన్నా,…

పరస్పర సహకారానికి చిహ్నం – రక్షాబంధన్‌

మన  దేశంలో  నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది.అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు  ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే..  ఆ మాసానికి ఆ నక్షత్ర పేరును పెట్టడం జరిగింది. ఆ విధంగానే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం…

నవ్యత వైపు నడక…

కొత్త వెలుగు వైపు ప్రయాణించడమే కవిత్వ లక్ష్యం. పాతను తుడిచి నవ్యమార్గం వైపు జాగ్రత్తగా వేసే ప్రతి అడుగూ అందరినీ ఆలోచింపజేస్తుంది. రసాత్మక భావ సమ్మేళనం జీవనమూలాలను స్పర్శిస్తూ సామాజికతను అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను వెల్లడిస్తూ నానీల తీరాన అన్న పేరుతో ఆలోచనాత్మకమైన నానీల సంపుటిని ఎన్‌ ‌లహరి వెలువరించారు. ఇది కవయిత్రి  లహరి వెలువరించిన…

సమాన విద్యావకాశాలు లేని జాతీయ విద్యా విధానం

‘‘ఉన్నత విద్య  లక్ష్యాలలో ఒకటి, తాజా జ్ఞానాన్ని సృష్టించడం, నిత్యం బోధించే ఉద్దేశ్యంతో పాటు సమాచార సమాజాన్ని నిర్మించడమే. ఈ పేర్కొనబడిన  ఆదేశం ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకుల నుండి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా కేంద్రాలలో పరిశోధనలను చేపట్టాలని ఆశిస్తోంది. నిరంతర పరిశోధన చేపట్టాలనే ఈ అంతర్నిర్మిత నిరీక్షణ విదేశాల్లో అనేక ఉన్నత విద్యాసంస్థలకు ప్రత్యేకతను…

హాట్‌ ‌కామెంట్స్ … ‌హీట్‌ ‌డిస్‌కషన్స్

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్‌ ‌కామెంట్స్ ‌కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్‌ ‌డిస్‌కషన్స్ ‌జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్‌ ‌ఫైట్‌ ఉం‌టుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ…