దేశీయ క్యాబ్‌ ‌భారత్‌ ‌ట్యాక్సీ

– జనవరి 1నుంచి దిల్లీలో ప్రారంభం

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్‌ ‌సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్‌ ‌ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ రాజధాని దిల్లీలో జనవరి 1వ తేదీ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ యాప్‌ ‌సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు. ఇందులో ఆటో, క్యాబ్‌, ‌బైక్‌ ‌సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు వెల్లడించింది. ఈ భారత్‌ ‌ట్యాక్సీ యాప్‌ ఆం‌డ్రాయిడ్‌, ఐవోఎస్‌ ‌రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్‌ ‌నంబర్‌తో రిజిస్టేష్రన్‌ ‌చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్‌ ‌ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్‌ ‌ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్‌ ‌ట్యాక్సీ యాప్‌లో రిజిస్టర్‌  ‌చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సేవల్లో రైడ్‌ ‌ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని  డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page