– మహిళలకు ఎవరేం చేశారో వారినే అడుగుదాం
– అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి17: మహిళలంటే మాజీ మంత్రి కేటీఆర్‌కు చిన్నచూపని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులైనా, బయట మహిళలనైనా ఎదగనీయాలంటూ కేటీఆర్‌కు మంత్రి చురకలంటించారు. ఫ్రీ బస్‌పై కేటీఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని సీతక్క ప్రశ్నించారు. మహిళా సంఘాలు ఐదు లక్షల కంటే ఎక్కువ తీసుకోకుండా బారికేడ్లు పెట్టారని.. ఇప్పుడు ఆ బారికేడ్లను తొలగిస్తున్నామని చెప్పారు. ఎవరి హయాంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయో వెళ్లి మహిళలను అడగాలని మంత్రి సవాల్ చేశారు. అభయ హస్తం డబ్బులను కూడా గత ప్రభుత్వం వాడుకుందని సీతక్క ఆరోపించారు. శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తున్నామని మంత్రి వివరించారు. మహిళలకు చెందిన అభయ హస్తం డబ్బులను కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలపై రూ.3000 కోట్ల భారం పెట్టిపోయిందన్నారు. కేటీఆర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.