బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే సహించం

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : బిసి జాబితాలో ముస్లింలను చేర్చితే ఏమాత్రం సహించేది లేదని మతపరమైన రిజర్వేషన్లకు బిజపి వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.    గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్‌ కు లేదని తేటతెల్లమైందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని, కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని హెచ్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పడం తథ్యమని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ కు చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే నన్నారు.

ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, ఇచ్చిన మాటతప్పుతూ బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్సేనని ఫైర్‌ అయ్యారు. బీసీలంతా కాంగ్రెస్‌ మోసాలను గుర్తించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్‌ కు లేదని, మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా? అని ప్రశ్నించారు. 15వ గ్రాంట్స్‌ కమిషన్‌ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదు.. 73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారు.

స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. లిరాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు…. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాల్నారు. సర్పంచ్‌ లేకుంటే గ్రామ సభలు, ప్రగతి పనులు అమలు జరిగేదెలా? అని నిలదీశారు. ఓడిపోతామనే భయానికే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page