రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్, బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. మనకు సహజంగా లభించే పండ్లు కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్రూట్ ఒకటి. శక్తినిచ్చే శాఖాహారదుంపల్లో బీట్రూట్ ది మొదటి స్థానం.. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీట్ రూట్ లో న్కెట్రేట్ల నిల్వలు అధికం. ఇవి ట్ ఆక్సైడ్ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్రూట్ కనం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్ రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా కలసిపోరు. ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్ రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది. అంతే కాదు బీట్ రూట్ లోని పుష్కలమైన ఐరన్, వ్యాధినిరోధకతను పెంచుతుంది, మరియు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. బీట్ రూట్ జీరో ట్రాన్స్ ఫ్యాట్ మరియు సాచురేటెడ్స్ అస్సలు లేని ఈ దుంప ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరియు డ్కెటర్స్ కోసం ఇది ఒక ఉత్తం వెజిటేబుల్. అలాగే షుగర్ పేషంట్స్ కు తీపిమీద కోరికలను కంట్రోల్ చేసి ఒక ప్రత్యామ్నాయ ఆహారం ఇది. ఇది మీ కడుపును నింపడంతో పాటు, స్వీట్ తీనాలనే కోరికిన సాటిస్పై చేస్తుంది. సౌందర్యానికి రూట్ విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్ రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే బీట్ రూట్ లో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..
అనిమియా: బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనీమియా పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది.. రక్తహీనతకు బీట్రూట్ మంచిది. ఇందులోని పోషకాలు ఎర్రరక్త కణాలను వృద్ధి చేసి శరీరంలో రక్త శాతాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయి.
బ్లడ్ కౌంట్ పెంచుతుంది: మహిళల శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రుతుసమస్యలతో బాధపడే మహిళలకు బీట్ రూట్ చక్కటి పరిష్కారం. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. బీట్ రూట్ లో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తపోటుకు చెక్ పెట్టాలంటే రోజూ ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హైబీపీ గలవారు బీట్రూట్ జ్యూస్ సేవిస్తే వెంటనే నాలుగు నుంచి ఐదు పాయింట్ల వరకు రక్తపోటు తగ్గుతుందని ఆస్ట్రేలియన్ అధ్యయనంలో తేలింది. బీట్రూట్లో విటమిన్ సి, విటమిన్ కె, పీచు పదార్థాలుండటంతో పాటు న్కెట్రేట్ శాతం కూడా అధికంగా ఉండటంతో హైబీపి నియంత్రిస్తుంది. వీర్యవృద్ధికి సహాయపడుతుంది. వీర్యావర్తక మందుగా దీన్ని రోమన్స్ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో బోరాన్ అధికంగా ఉండి, సెక్స్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరాన్నిశుభ్రం చేస్తుంది/ బీట్ రూట్ యొక్క ఒక ఉత్తమ ఆరోగ్యప్రయోజనం, శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా కాలేయం మరియు కోలన్ రెగ్యులర్ గా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. మరియు రక్తాన్ని శుద్ది చేస్తుంది.
-వేణుగోపాల్





