స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి

– మేడారం పనులను సకాలంలో పూర్తి చేయాలి
– మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: నిర్ణీత సమయంలో మేడారం మహా జాతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, పార్కింగ్ స్థలాలను, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న పనులను, విఐపి, వివిఐపి రోడ్లను, శ్రీరామ్ సాగర్ చెరువును, రోడ్ల విస్తరణను, జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాలను
గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మేడారంలోని ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జంపన్న వాగు పరిసరాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున స్నాన ఘట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. కొంగలమడుగు ఏరియా నుంచి జంపన్న వాగు వరకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో చిత్ర మిశ్రా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page