special Stories

special Stories

వరుస భేటీలు ..!

బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వరుసగా రెండు రోజుల నుండి ఆపార్టీ సీనియర్‌ ‌నాయకుడు సిద్దిపేట శాసనసభ్యుడు,మాజీ మంత్రి  తన్నీరు హరీష్‌రావు ఇంటికి వెళ్ళడం తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధానంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధిపత్యంపైన రాష్ట్రంలో విస్తృత చర్చజరుగుతున్న నేపథ్యంలో  వీరి భేటీ ఆసక్తిని కలిగిస్తున్నది. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో…

దేశ భక్తి

ప్రదర్శనాత్మక దేశభక్తి అనేది ఎక్కువగా దేశభక్తిని బాహ్యంగా ప్రదర్శించడంలో కేంద్రీకృతమై ఉంటుంది. మరోవైపు, బాధ్యతాయుత దేశభక్తి అనేది దేశ పాలనాభివృద్ధికి సహాయపడే చర్యలపై దృష్టి పెడుతుంది. ఏ కారణమో కానీ, భిన్నాభిప్రాయం తెలపడమన్నది అతి ఉన్నతమైన దేశభక్తి రూపమని  కొన్ని తర్కబద్ధమైన గొంతులు పేర్కొంటాయి. అంటే, దేశభక్తి అనేది జాతీయ గీతం పఠించడం, జెండా ఎగరేయడం…

జనం సొమ్ముతో జలగలకు  ప్రచారం 

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిస్ వరల్డ్  పోటీలు అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది..మిస్‌ వరల్డ్ పోటీదారులను రోజుకోక ప్రాంతానికి తీసుకు వెళ్లి తెలంగాణ గొప్పదనాన్ని, తెలంగాణ సంస్కృతిని పరిచం చేస్తున్నారు.. రాష్ట్రంలో కీలకమైన ప్రదేశాలను తీసుకువెళ్లి అక్కడి ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. .అయితే సుందరీమణుల వరంగల్‌లో పర్యటన అత్యంత వివాదాస్పదం…

ఆశలు తుంచుకోవడమే, విధేయత!

భారత్‌ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులలో ఒకరైన తన్నీరు హరీష్‌ రావు పార్టీ అధినేతకు, పార్టీకి తన విధేయత గురించి మళ్లీ బహిరంగంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కెసిఆర్‌ గీసిన గీత దాటని క్రమశిక్షణ తనదని చెప్పడమే కాదు, ఒకవేళ, కెటిఆర్‌ కు నాయకత్వం అప్పగిస్తే అందుకు తాను పూర్తిగా అనుగుణంగా ఉంటానని కూడా స్పష్టం…

ట్రంప్ యుద్ధం ఆపించాడా? 

Did Trump stop the india pak war?

ఇంత గందరగోళం ఎందుకు సర్‌జీ? ముందుగా నెవిల్ చాంబర్లేన్ ఏమన్నాడో చూద్దాం : “యుద్ధంలో ఎవరు తాము విజేతలమని ప్రకటించుకున్నా, చివరికి ఓడిపోయేది అందరూ…” ఇప్పుడు ‘ఇన్‌సైడ్ మ్యాన్: మోస్ట్ వాంటెడ్’ అనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే సినిమాలో డైలాగ్ చూద్దాం : “నీవింకా అమెరికా ఆధిపఠ్యాన్ని నమ్ముతున్నావంటే నువ్వొక జోకర్ వి. అమెరికన్…

నిన్న జేజేలు! నేడు ఛీత్కారాలు 

 ప్రధాని మోదీకి సంకటస్థితి! భారత దేశ అంతర్గత రాజకీయాల్లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి తాము కొమ్ములు తిరిగిన వారమనుకొనే మహానేతలైన జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలను చేతికిందకు తెచ్చుకోవడమో లేక నేల కూల్చడమో అప్రతిహతంగా సాగిస్తున్న నరేంద్ర మోదీ చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి చిక్కి అపకీర్తి మూట గట్టుకున్నారు. జయ…

వేగుంట రాఉడు పాడిన చలిగీతం

చిడతలు ఊడిన రెక్కలకిటికీ తెరిచిపెట్టవద్దని ఒహటే మొత్తుకోలు! వడగాలిలా సుడిగాలిలా ఆ వేళ చలిగాలి రివ్వున వీయడంతో కవిగారి కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లుపోవడం, పై పెదవికి కిందిపెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోదప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటివరకు తన హృదయమనే ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగదీసుకుని మూడంకె వేసి…

తెలంగాణ పట్టెడ కోయ సాహిత్యం

పెళ్ళికోసం ఇంటిని నాలుగుగదులుగా విభాగం చేస్తారు. అనగొంది (వూజగది) పెల్ గొంది (పెళ్లిగది) వంటగది మరియు అరుగు. అనగొందిలోకి ఇంటి ఆడపడుచులను అనుమతించరు. వూర్తిగా నిషేదం అంటారు వరలక్ష్మి. కుంజ వరలక్ష్మి సాంస్కృతిక పరిశోధకురాలు. ‘తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన కళాకారులు డాక్యుమెంటేషన్’ ప్రాజెక్టు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ప్రాజెక్ట్ ఫెలోగా…

సొంపు

‘ఎంత సౌందర్యం?’ రెప్పలార్పకుండా తెరిచిన నోరు ముయ్యకుండా అంది మగపురుగు. ‘నన్ను పొగడడమే నీకు విధిలాగుంది’ రెప్పల్తెరవకుండా ఆవలింత తీస్తూ అంది ఆడపురుగు. ‘నిన్ను కాదు’ మాటలు రానట్టు తన్మయంతో చూపు తిప్పకుండా అంది మగపురుగు. ఆ మాటకు వులిక్కిపడి కళ్ళుతెరచి చూస్తూ తనూ రెప్పలు కదపకుండా అలానే వుండిపోయింది ఆడపురుగు. రంగురంగుల పిట్ట వొకటి…

అగ్ని పురుగుల జుగల్‌ ‌బందీ

పదం దేహం పద రంగ ప్రదర్శనం రంగనాథ దర్శనం దిగి పోతున్నాను ధరిత్రి నుండి జనాబ్‌ అబ్దుల్‌ ‌సమద్‌ఖాన్‌ ‌జుగ్ను హోటల్‌ ఇద్దరూ దిగిపోయినాక వుపసంహరించుకుంటున్నాను పదాన్నీ ప్రదర్శననీ కాలమొక లైలాండ్‌ ‌లారీ ఈ సెకండు ఎవడి వంతో నాకు తెలుసు పోతులూరికి తెలుసు ఓషో, అమాయకుడు ఏమీ నేర్చుకోనక్కర్లేదన్నాడు అప్రమత్తంగా అభద్రంగా ప్రమాదకరంగా బ్రతకడం…