special Stories

special Stories

నైతిక‌త పెంచే విలువ‌ల పెంప‌కం

వేగంగా పరివర్తన చెందుతున్న ప్రపంచంలో  మానవ  సంబంధాలు అదృశ్యమైపోతున్నాయి.ధనం మనిషిని నడిపించే ఇంధనంలా మారిన నేపథ్యంలో  మానవ జీవితాలు కడు దుర్భరంగా మారుతున్నాయి. ఆప్యాయతలకు, బంధాలకు అర్థాలు, నిర్వచనాలు మారిపోతున్నాయి. మానవ సంబంధాలు విశ్వసనీయత కోల్పోయి, ఆర్ధిక బంధాలుగా పరివర్తన చెందుతున్నాయి. మేలు చేసిన వారికి కీడు ఎదురవుతున్నది. మనుషుల మధ్య మాటలు కూడా కరువైపోయి,…

ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం..!?

ఎన్నో ఏళ్ల‌ తెలంగాణ కల సుదీర్ఘ పోరాటం తర్వాత నెరవేరినప్పటికీ తిరిగి నిధులు, నీళ్లు, నియామకాల రూపంలో ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన విధానం నుంచి తెలంగాణ అనే భావన రూపుదిద్దుకొంది. 1959 ముల్కీ, నాన్-ముల్కీ సమస్యల నుంచి, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ అనబడే ప్రాంతీయ భావన బలపడడానికి…

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) – భవిష్యత్తు సమాజం ముందు నిలిచిన సవాళ్లు

Artificial Intelligence (AI) – Challenges facing future society

ఇటీవలి కాలంలో “ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్” (కృత్రిమ మేధ) గురించి తరచుగా వింటున్నాం. ఉద్యోగులు చేసే దాదాపు అన్ని పనులు కృత్రిమ మేద చేయగలుగుతుందని దీని పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులుగా మారుతారనే భయాందోళనలు ప్రజల్లో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కృత్రిమ మేద అంటే ఏమిటి, నిజంగానే…

పుష్కరకాల ‘త్యాగాల తెలంగాణకు’ ఏమైంది.?

Telangana armed struggle

తెలంగాణ అంటే ప్రాంతం పేరు మాత్రమే కాదు. ఉద్యమాలకు  చిరునామా. దశాబ్దాలుగా న్యాయం కోసం,హక్కుల కోసం, ప్రజలు చేసిన పోరాటానికి ఇది ప్రతీక.జూన్ 2 భారత దేశ చరిత్రలో లిఖించదగిన రోజు.ఆరు దశాబ్దాలుగా తండ్లాడిన తెలంగాణ సాకారం అయిన  రోజు.స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం,స్వయం పాలన కోసం, ఆత్మ గౌరవం కోసం, అస్తిత్వం కోసం,ఆధిపత్యం నుండీ విముక్తి కోసం…

రాష్ట్రం సాధించినా.. సామాజిక తెలంగాణ ఏది?

స‌మైక్యాంధ్ర‌లో మనం ద్వితీయ శ్రేణి పౌరులమే.. భాష, యాసపై దాడి.. ఎగతాళి నిధులు, నియామకాలు, నీళ్లలో నిలువు దోపిడీ నేడు 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగానే బ‌తికామన్న వాస్తవం మరువలేనిది. తెలంగాణ భాష, యాస…

ద‌ళ‌ప‌తి క‌మ‌ల‌నాధులు వ‌ద‌లిన బాణ‌మా?

త‌మిళ‌నాడు రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎన్నిక‌ల మూడ్‌లోకి రావ‌డంతో, రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. అధికారాన్ని నిలుపుకునేందుకు స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి పవర్‌లోకి వచ్చేందుకు ఏఐడీఎంకే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ, హీరో విజ‌య్ నేతృత్వంలోని టీవీకేలు కూడా అధికారంపై ఆశ‌లు పెట్టుకొని ఆదిశ‌గా ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. ప్రాంతీయవాదం, భాషా వివాదం…

తెలంగాణ అస్థిత్వానికి పొంచిఉన్న ప్రమాదం 

(మండువ రవీందర్‌రావు ) నేటికి పన్నెండు ఏళ్ళ కింద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాట కల నెరవేరింది ఈనాడె. ఇక్కడి వనరుల దోపిడి, సాంస్కృతిక వివక్ష, కొల్లగొట్టిన ఉద్యోగాలు, భూములు, నదీజలాల తరలింపును వ్యతిరేకిస్తూ జరిపిన అనేక పోరాటాలు, అవమానాలు, అవహేళనలు…

దశాబ్ధంగా నలుగుతున్న బిఆర్‌ఎస్‌ ‌విలీన వివాదం

బి(టి)ఆర్‌ఎస్‌ ‌పార్టీ మరో పార్టీలో విలీనమన్నది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్న ప్రచారం  కాదు.  ఇంతకాలంగా కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ను బంతాట అడుకుంటూ వొచ్చాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కాంగ్రెస్‌లో కలుస్తుందని బిజెపి ఆరోపిస్తే, బిజెపిలోనే కలుస్తుందని కాంగ్రెస్‌ ‌వాదిస్తూ వొచ్చాయి. అయితే తాజాగా బహిర్గతమైన కవిత లేఖ ఈ చిక్కుముడిని విప్పినట్లైంది. బిఆర్‌ఎస్‌ను బిజెపిలో కలిపేందుకు 101 శాతం…

సారు మారతారా, కారు రిపేరవుతుందా?

ఎంతో ముఖ్యమైనవి, సామాజిక ప్రాధాన్యం ఉన్నవి చాలా పరిణామాలు కళ్లెదుట  ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, నిరసనల మీద గృహనిర్బంధాల నీళ్లు చల్లుతూ  నిర్వహిస్తున్న  ప్రపంచసుందరి పోటీలు, అభాసుపాలయ్యాయి, అందులో సౌందర్యాత్మక హింస తప్ప, సంస్కారమేమీ లేదని పోటీదారులే చాటి చెబుతున్నారు. ఈ పోటీల వ్యవహారం నిర్వాహకులకే కాదు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి,  తెలంగాణ ప్రతిష్ఠకు కూడా మచ్చ తీసుకువచ్చింది.…

గాజాలో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు

ఐక్యరాజ్యసమితికి తన పని చేయనివ్వండి మే 15 ఉదయం, ఉత్తర గాజాలోని బీత్ లహియాలో తన తాతగారితో కలిసి బ్రెడ్ వేపడంలో సహాయం చేస్తున్న ఏడేళ్ల మిరాన్ మొహమ్మద్ ఆకలితో ఉండి, వేడి బ్రెడ్ కోసం ఎదురుచూస్తోంది. కానీ ఆ బ్రెడ్ తినే అవకాశం మిరాన్‌కు రాలేదు.  ఆమె తల్లి, ఇంటికి వెళ్లిన తరువాతే తినాలని చెప్పడంతో, వారు…