prajatantra_news

prajatantra_news

పుల్వామా అమరులకు నివాళి

– కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డాక్ట‌ర్‌ కావ్య వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 14) ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్…

ముఖ్యమంత్రిని కలిసిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

– వారితో పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి జూపల్లి తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌లో గెలిచిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్…

మంత్రులకు సీఎం అభినందనలు

– ముగిసిన ఇష్టాగోష్ఠి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

జాతీయ సదస్సుకు కుమారస్వామికి ఆహ్వానం

జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, ఎల్.బి. బిఈడి కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామికి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈనెల 17, 18…

మహా శివరాత్రి వేడుకలకు ఆల‌యాలు ముస్తాబు

– వేములవాడలో నేటి నుంచే రాజన్న జాతర – భీమేశ్వరాలయంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, వరంగల్ వేయి స్తంభాల గుడి తదితర క్షేత్రాల్లో…

సీపీఐ నేత గిరిప్రసాద్ సతీమణి కమలాదేవి కన్నుమూత

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సీపీఐ అగ్ర నాయకుడు నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె…

రైతులకు త్వరలో శుభవార్త

– రైతు భరోసా విడుదలకు రంగం సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల పక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం…

ఖ‌మ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజ‌కీయాలు

– ఛైర్ ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌పై ఉత్కంఠ‌ – కొత్త‌గూడెంలో ర‌స‌ప‌ట్టు రాజ‌కీయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా  ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా…

మున్సిపల్ పోరులో పొంగులేటి ఛాంపియన్

– 10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం – 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు – ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్…

ఈ విజయం ‘దామన్న’కే అంకితం

– సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలు – మూడింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుని మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని…