prajatantra_news

prajatantra_news

మెదక్‌లో మరోమారు వర్ష భీభత్సం

– నీట మునిగిన పట్టణం మెదక్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11: ‌మెదక్‌ ‌పట్టణంలో గురువారం ఉదయం వర్షం దంచికొట్టింది. పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోమారు ఉదయం వాన దంచి కొట్టడంతో  వాగులు ఉధృతంగా ప్రవహించాయి.ఆగస్ట్ 27 ‌నుంచి 29 దాకా కురిసిన భారీ వర్షాలు మెదక్‌ ‌జిల్లాకు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. చెరువులకు…

గొర్రెల స్కామ్‌ ‌కేసులో ఈడీ దూకుడు

– విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు – కోట్లు గోల్‌మాల్‌ ‌జరిగినట్లు గుర్తించిన ఈడీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో…

సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట

– వోటర్‌ ‌నమోదుపై దాఖలైన కేసు కొట్టివేత న్యూదిల్లీ,సెప్టెంబర్‌11: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనాయకురాలు సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే 1980లో వోటర్‌గా రిజిస్టర్‌ ‌చేసుకున్నారని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఆమె ఎన్నికల…

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

– విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్‌, ‌వనస్థలిపురం, హయత్‌నగర్‌,…

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 10 ‌మంది మావోయిస్టులు మృతి, మ‌రికొంద‌రికి గాయాలు – ఒడిస్సా రాష్ట్ర దళ కార్యదర్శి మోడెం బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు ప్రమోద్‌ ‌మృతి – బస్తర్‌ ‌కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న హిడ్మాకు ఎదురుదెబ్బ – సంఘటన స్థలం వద్ద అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11 : ‌సరిహద్దున ఉన్న…

వోట్‌ ‌చోరీపై అణుబాంబు లాంటి ఆధారాలు

– పునరుద్ఘాటించిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ లక్నో, సెప్టెంబర్‌11: ‌వోట్‌ ‌చోరీ గురించి త్వరలో అణుబాంబు లాంటి ఆధారాలు వెల్లడిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బిజెపి వోట్‌ ‌చోరీకి పాల్పడుతున్నదని పునరుద్ఘాటించారు.వోట్‌ ‌చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వెల్లడించానని, భవిష్యత్తులో’ హైడ్రోజన్‌ ‌బాంబ్‌ ‌వంటి ఆధారాలు బయటపెడతానని అన్నారు.తన నియోజకవర్గం రారుబరేలీలో…

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

– అధికారులను అప్రమత్తం చేసిన సిఎం – సమన్వయంతో ముందుకు వెళ్లాలని రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ‌రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ ‌నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో…

ఎంగిలిపూల బతుకమ్మకు కవితకు ఆహ్వానం

– ఆహ్వాన పత్రిక అందజేసిన చితంమడక మహిళలు – కేసీఆర్‌లాంటి గొప్ప వ్యక్తిని కన్న గొప్ప ఊరు  – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్యేగం =సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఎం‌గిలిపూల బతుకమ్మ పండుగకు రావల్సిందిగా బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ‌సొంతూరైన సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు…

మంథనిలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి

– ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌  ఆధ్వర్యంలో డిజిటల్‌ తరగతులు ప్రారంభం – ఐటి, పరిశ్రమలు, శాసనససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి టౌన్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని ఐటీి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌…

రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టులు త్వ‌ర‌గా పూర్తి చేయండి

– కొత్త లైన్ల కోసం భూసేకరణకు సిద్దం – భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు – పర్యాట‌క కేంద్రాలను అనుసంధానిస్తూ రైల్వే లైన్లు – శంషాబాద్‌ – అమరావతి మధ్య గ్రీన్‌ ‌కారిడార్‌ -‌రైల్వే అధికారుల సమీక్షలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ‌పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం…