prajatantra_news

prajatantra_news

ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తాం

బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో హామీ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌…

మహిళల ఉన్నతికి బ్యాటరీ బస్సులు

ఊరికో బస్సు, ఇంటికో దీపంతో అభివృద్ధికి బాటలు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి   మధిర, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన,…

ఆధునిక టెక్నాలజీతో మెరుగైన విద్యుత్‌ సేవలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: విద్యుత్‌ సరఫరాలో ట్రిప్‌ అవడాన్ని త్వరగా గుర్తించి వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు విద్యుత్‌ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ చరిత్రలో ఇది కీలక ఘట్టమని అన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన,…

జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: ములుగు జిల్లా జంపన్న వాగు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం సమక్క-సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యం పొందిన ఈ వాగు అభివృద్దికి మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్‌ రెడ్డి భేటీలో హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ హామీ ఇచ్చారు. దిల్లీలోని శ్రమ్‌ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.…

గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ

కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ చెప్పారు. ఈ పాలసీపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

డిజిటల్‌ సురక్షితమైతే మరింత అభివృద్ధి

గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ప్రారంభం ముదావహం సీఎం రేవంత్‌రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గూగుల్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోగా నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌మయమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను నగరంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్‌…

కాంగ్రెస్‌ అంటేనే కరెంటు.. కరెంటు అంటేనే కాంగ్రెస్‌

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు రాబోయే 10 ఏళ్ల డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 1912 108 మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ అంబులెన్స్‌ సేవలు విద్యుత్‌ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: కరెంటు అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటేనే కరెంటు అని డిప్యూటీ…

త్యాగశీలి కొమ్మిడి సుగుణ

మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంతాపం   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర వనిత కొమ్మిడి సుగుణ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా…

యుద్ధం మరింత విస్తరిస్తే..

అమెరికాలో పెరుగుతున్న భయం తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలి: ట్రంప్‌ హెచ్చరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం విస్తరిస్తుందన్న భయం అమెరికా అధికారుల్లో పెరుగుతోంది. తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి తెస్తోంది. అమెరికా అధికారుల ప్రకారం ఇజ్రాయెల్‌ యుద్ధానికి…