prajatantra_news

prajatantra_news

చ‌లి పులి చంపేస్తోంది

– పలుచోట్ల పొగమంచుతో ఇబ్బందులు హైదరాబా, జనవరి1: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నెల రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలేకాక పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు…

మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాడులు

– అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఇందర్జీత్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు భారీగా లెక్క చూపని బంగారం, వజ్రాలు, నగదు పట్టివేత న్యూదిల్లీ, జనవరి 1: మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి స్వర్ణప్రియ విహార్‌ ప్రాంతంలో ఉన్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఇందర్జీత్‌ సింగ్‌ యాదవ్‌, అతని అనుచరుల ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో…

విక‌సిత్ భార‌త్ సాధ‌న‌లో భాగ‌స్వాములు కావాలి

– బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1ః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ గ‌త సంవ‌త్స‌రం (2025)లో ముందుకు సాగింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు తెలిపారు. నూతన సంవత్సర ం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయ‌న గురువారం…

మానవత్వమే గొప్ప కానుక

– బొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి – చలి నుంచి పేదలను రక్షించవచ్చు – మంత్రి సీతక్క పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1:సెర్ప్ విభాగం ద్వారా రాష్ట్రంలో పేద‌రిక‌ నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో…

గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1 : హైదరాబాద్ లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈమేర‌కు బొకే అంద‌జేసి ఆయ‌న‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు. జలాలు, నిజాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్‌లో ప‌వ‌ర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.…

రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి

– తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి  తిరుమ‌ల‌, జ‌న‌వ‌రి 1ః రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తిరుమ‌లేశుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఉదయం తిరుమల లో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దరి్శంచుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…

నీటిపారుదల అంశంపై హరీష్ అబద్ధాల పరంపర

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా, దృఢం గా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనమే సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5వ…

అజో-విభొ-కందాళం, సహృదయ సంస్థల అధ్వర్యంలో విశిష్ట పురస్కారాలు

– మండువ రవీందర్రావు హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 33వ వార్షికోత్సవాన్ని, ప్రముఖ సాహిత్య సంస్థ అజో-విభో-కందాళం సంస్థతో కలిసి జనవరి ఒకటి నుండి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలతోపాటు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందజే యనున్నారు. కార్యక్రమాల్లో భాగంగా…

సింగరేణి బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల డిమాండ్‌ గోదావరిఖని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇప్పటివరకు ట్రాన్స్‌కో,…

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందే

– సీఐటీయూ నాయకుల డిమాండ్‌ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్‌ ఎదుట కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ…