prajatantra_news

prajatantra_news

మాజీ ఐపీఎస్‌ ‌భార్యకు టోకరా

ఈ మధ్య కొత్తరకం సైబర్ నేరస్తులు తయారయ్యారు. వీరి గురించి అన్ని వార్తాపత్రికలలో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. రోజు ఈ పేపర్ చదివే మా స్నేహితుడు ఈ సైబర్ నేరస్తుల నుండి తనను తాను కాపాడుకోగలిగాడు. సైబర్ నేరస్థుడు మా స్నేహితునికి ఫోన్ చేసి మీ పేరు ఇదేనా, మీ అబ్బాయి పేరు ఇదేనా, మీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడా,మీ అబ్బాయి మీకు ఒక అని ఏదో చెప్పబోయాడు. న్యూస్ పేపర్లో చదివిన ఈ కొత్తరకం సైబర్ నేరాల గురించి తెలుసు కాబట్టి, అతను ఆ సైబర్ నేరస్తుడితో, సైబర్ నేరాలు అరికట్టే వారికి ఫోన్ చేస్తాను నువ్వు లైన్ లో ఉండు అనగానే అతడు ఫోన్ కట్ చేశాడు. కొందరికి ఈ సైబర్ నెరగాళ్లు ఫోన్ చేసి మీ పేరు, మీద మీ పిల్లల నుండో, ఇతరుల నుండో డ్రగ్స్ వచ్చినై అని చెప్పి వారిని కారాగార శిక్ష నుండి తప్పించేందుకు లక్షలు వసూలు చేస్తున్నారు. నా స్నేహితుడు తప్పించుకోగలిగాడు గాని ఎందరో భయపడి లక్షల కొద్ది నష్టపోతున్నారు. కానీ అసలే న్యూస్ పేపర్ చదవని అంత సమయం లేని ఒక ఐటీ ప్రొఫెషనల్ దీనికి బలైపోయాడు. అతన్ని డిజిటల్ అరెస్ట్ అని నాలుగు గంటలు ఆయన ఇంట్లోనే ఆయన గదిలోనే బంధించి నానా విధాల మానసిక చిత్రహంస చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. ఈ విధమైన సైబర్ నేరస్తులకు బలి అయినా ఒక 74 ఏండ్ల మహిళ 32 లక్షలు తనే సొంతంగా బ్యాంకుకు వెళ్లి ఆ సైబర్ క్రిమినల్స్ చెప్పిన అకౌంట్లో డబ్బులు వేసి మోసపోయింది. అసలు విషయం ఏంటంటే ఈ సైబర్ నేరస్తులకు విదేశాలకు తమ పిల్లల్ని పంపిన వారి వివరాలు ఎలా తెలుస్తున్నాయి? సాధారణంగా ఇలాంటి విషయాలు పాస్ పోర్ట్ ఆఫీస్ లో గాని, లేక వారి విదేశాల్లో ఉండే వారి పిల్లలకు తినుబండారాలు పంప్ ఫెడెక్స్ లాంటి సంస్థల దగ్గర గాని, లేక వారికి డబ్బు పంపించే యూనిమని లాంటి సంస్థల దగ్గర ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్ లో విషయాలు అంత త్వరగా బయటికి లీక్ అయ్యే అవకాశం ఉండవు. అంటే ఈ సమాచారం డబ్బు లేదా వస్తువులు చేరవేసే సంస్థల ద్వారా సైబర్ నేరస్తులకు చేరుతుంది. ఈ సంస్థల కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్ చేసి అంటే రహస్యంగా వాటిలోనికి వైరస్ ల ద్వారా వీరి ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెట్టి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని దొంగిలించటం లేక సంస్థలో పనిచేసే వారిని బెదిరించో లేక వారిని ప్రలోభ పెట్టొ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉంది. ఈ మధ్య ఆధార్ కార్డు సంస్థ దగ్గర ఉన్న వివరాలు కూడా దొంగలించబడ్డాయని ఒక న్యూస్ వచ్చింది. ఒక ఐటీ ప్రొఫెషనల్ 'కీ' మీ ఆధార్ ఉపయోగించి ఒకరు వందల కోట్ల క్రైమ్ చేశారు. అందులో మీ పాత్ర కూడా ఉందని మేము అనుమానిస్తున్నాము. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇవ్వండి అందులో ఉన్న డబ్బంతా వారు చెప్పిన ఎకౌంట్ కు పంపిస్తే మేము వెరిఫై చేసి ఒకవేళ మీరు నిర్దోషి అయితే ఆ మొత్తం తిరిగి మీకు పంపిస్తాను అని బెదిరించారు. ఇలాంటి సైబర్ క్రైమ్ల గురించి ప్రధానమంత్రి మోదీ కూడా ఈ మధ్య తన మన్ కీ బాత్ లో చెప్పాడు. అయినా ఆ రోజు తర్వాత వరుసగా ఈ సైబర్ క్రైమ్లకు బలైన వారు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్లు సైబర్ క్రైమ్ ల గురించి ఎంతో ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా వారు ఎన్నో విధాల రక్షణ వ్యవస్థల్ని కూడా ఏర్పరిచారు. తెలంగాణ ప్రభుత్వం బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే పేరుతో సైబర్ క్రైమ్ నియంత్రణకు, బాధితుల రక్షణకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పరిచింది. రాష్ట్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ వెబ్సైట్ లో 30 రకాలకు పైగా ఏ విధంగా సైబర్ క్రిమినల్స్ ప్రజలను మోసం చేస్తారో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం మొత్తంలో సైబర్ క్రైమ్ ల వల్ల బలి అయిన వారు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతిరోజు దేశంలో కొన్ని లక్షల రూపాయల వరకు సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు నష్టపోతున్నారనేది కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో దేశ ప్రజలు 1740 కోట్ల రూపాయలు సైబర్ నేరాల ద్వారా నష్టపోయారు. ఒక పరిశోధన ప్రకారం 2047వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము దేశ ప్రజలు 17 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారని అంచనా. అంతేకాకుండా కొందరు ప్రాణాలు కూడా ఈ సైబర్ క్రైమ్ తీస్తుంది. ఆ మధ్యలో ఒక స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి మీ అమ్మాయి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి. డబ్బులు పంపిస్తే మేము ఆ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో పెట్టమని చెప్పి బెదిరించారు. అది అబద్దం అని ఆమె కొడుకు చెప్పినా ఆమె భయానికి గుండె నొప్పి వచ్చి చనిపోయింది. సైబర్ క్రైమ్ ల వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. వాటి నివారణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దీని నిమిత్తం హైదరాబాదులో ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్ 1930 మరియు వాట్సాప్ నెంబర్ 8712665171 నీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కేటాయించాయి. అంతే కాకుండా లక్ష లోపు సైబర్ క్రైమ్ నష్టాలు జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్ కు అంతకన్నా ఎక్కువ నష్టాలు జరిగితే సైబర్ క్రైమ్ సెల్ ను సంప్రదించాలని ప్రకటించాయి. ఈ మధ్య యూజీసీ కూడా సైబర్ నేరాలు నుండి తమను తాము విద్యార్థులు ఎలా కాపాడుకునేందుకు కావలసిన సూచనలతో ఒక హ్యాండ్ బుక్ ని కూడా తయారు చేసి విద్యార్థులకు ఆన్లైన్లో ఈ బుక్ రూపంలో పెట్టింది. ఇదివరకు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఫోన్ కాల్ ముందు కోవిడ్ నుంచి ఎలా కాపాడుకోవాలో సూచనలు ఇచ్చేవారు. అదే విధంగా ఇప్పుడు ప్రతి మల్టీమీడియా చానల్స్ లో, టీవీ చానల్స్ లో. ఫోన్ కాల్ ముందు, ఈ క్రింది సూచనలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ సూచనలు పోస్టర్ల పై ప్రింట్ చేసి ప్రతి చోట ముఖ్యంగా పల్లెటూర్లలో కూడా అతికించాలి. సైబర్ క్రైమ్ నుండి తమను తామ రక్షించుకునేందుకు తీసుకోవాల్సన అతి ముఖ్యమైన జాగ్రత్తలు: 1. తెలియని వారి నుండి అంటే ఫోన్లో కాంటాక్ట్స్ లేని వారి నుండి వస్తే ఎత్తకూడదు. 2. పెట్టుబడులు పెట్టమని వచ్చే ప్రకటనలు నమ్మకూడదు. 3. ఒకవేళ అనుకోకుండా తెలియని వారి నుంచి వచ్చిన ఫోన్ ఎత్తిన వారు బెదిరిస్తే బెదిరింపులకు భయపడకూడదు. ఫోను కట్ చేయాలి.4. పోలీస్ అని డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ చేస్తే ఒకవేళ ఫోన్ చేసే వాళ్ళు వాట్సాప్ లో వీడియో ద్వారా గాని పోలీస్ డ్రెస్సులు వేసుకొని కానీ లేక పోలీస్ డ్రెస్ ఫోటో తోని కాల్స్ వచ్చిన ఎత్తకూడదు. 5. ఒకవేళ మీ కాంటాక్ట్స్ లో లేని వారి నుండి ఫోన్ వస్తుందని మీరు కనుక ఎదురు చూస్తుంటే ఆ ఫోన్ ఎత్తి మీరు అనుకున్న వారి నుండి ఫోన్ అయితేనే మాట్లాడండి లేకపోతే కట్ చేయండి. 6. ఆన్లైన్ గేమ్స్ అసలే ఆడకండి . 7. ఆన్ లైన్ లోన్స్ ని అసలే తీసుకోకూడదు. 8. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ లో తక్కువ డబ్బు ఉంచుకోండి. 9. ఓటీపీలు ఎవరితో షేర్ చేయకూడదు. 10. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, పాస్ వర్డ్ , మీ ఆస్తుల వివరాలు, మీ క్యాష్ బ్యాలెన్స్ వివరాలు ఏవి కూడా మొబైల్ లో స్టోర్ చేయకండి. 11. ఫోన్ ద్వారా మీకు పంపించినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు. 12. మీకేదో లాటరీ వచ్చిందని దానికి కొంత డబ్బు ఇస్తే మొత్తం డబ్బు పంపిస్తామని అటువంటి సమాచారాలు నమ్మకండి. 13. అతి తక్కువ సమయంలో ఏ బ్యాంకు ఇవ్వలేని వడ్డీ శాతం అంటే సంవత్సరానికి 24 శాతం అంతకన్నా ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్తే అలాంటివి నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు.14. బ్యాంకులు, పోలీసు శాఖ వారు, ఇన్కమ్ టాక్స్ శాఖ వారు, ఇతర ప్రభుత్వ సంస్థలు గాని మీ బ్యాంకు వివరాలు అడగవు. కాబట్టి ఈ సంస్థల నుండి ఫోన్ ఎవరు చేయరు. అలా చేస్తున్నామని చెప్పిన వారికి వివరాలు ఇవ్వకూడదు.15. మీరు చూసే రీల్స్ లో గాని లేక ఇతర వీడియోస్ లో గాని మీకు ఉపయోగపడుతుందని మీకు సహాయం చేస్తామని ఏమైనా లింక్స్ ఇస్తే వాటిని క్లిక్ చేయకూడదు. 16. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటివారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫీసు చూపెట్టి డబ్బులు అడిగినా వారిని నమ్మకూడదు. ఒకవేళ ఇలాంటి అవకాశాలు ఆన్ లైన్ లో ఉంటే అసలే నమ్మకూడదు. ప్రభుత్వ సంస్థలు కూడా ముఖ్యంగా పోలీసు సంస్థలు ఇలాంటి మోసపూరిత సంస్థల వివరాలు సేకరించి ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వాట్సప్ సంస్థ కూడా ఒక వినియోగదారిని కాంటాక్ట్స్ లో లేని వారి నుండి వీడియో, కాల్స్ వస్తే వాటిని కట్ చేయాలి. అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకుని ఆప్షన్ సెట్టింగ్స్ లో ఉంచాలి. ప్రజలు మరియు ప్రభుత్వ ఇతర సంస్థలు కూడా ఒకవేళ వారి ఫోన్ చేసే వ్యక్తి కాంటాక్ట్స్ లో నెంబర్ లేదు అని తెలిస్తే, ముందు వారికి మెసేజ్ పంపి ఎందుకు ఫోన్ చేస్తున్నారో కారణం తెలిపి ఫోన్ చేస్తే అప్పుడు అలాంటి ఫోన్స్ ని ఎలాంటి సంకోచం లేకుండా ఎత్తే అవకాశం ఉంటుంది. -డాక్టర్ మండవ ప్రసాద్ రావు

– రూ.2.58 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ ‌మోసగాళ్లు -ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: పెట్టుబడుల పేరుతో మాజీ ఐపీఎస్‌ అధికారి భార్యకు సైబర్‌ ‌నేరగాళ్లు వలవేసి, దాదాపు రూ.2.58 కోట్లు కొల్లగొట్టారు.స్టాక్‌మార్కెట్‌ ‌ట్రేడింగ్‌లో చిట్కాలు చెబుతామంటూ తొలుత వాట్సప్‌ ‌సందేశం పంపించారు. ఆమెకు అవగాహన లేకపోకవడంతో.. తన భర్త నెంబరును…

అవ‌య‌వాన్ని కోల్పోతే స్వ‌తంత్ర జీవ‌నం కోల్పోయిన‌ట్టే

– జీవితాన్ని ప‌రిపూర్ణంగా మార్చ‌డ‌మే నిజ‌మైన వైద్యం – ఆంప్యుటేష‌న్ మొద‌టి నిర్ణ‌యం కాకూడ‌దు – ఇలిజారోవ్ లింబ్ రీకన్‌స్ట్రక్ష‌న్‌ విధానంతో ఎంతో మేలు – కేర్ హాస్పిట‌ల్స్ విజ‌య‌గాథ‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: ఒక చేయి లేదా కాలు కోల్పోవడం అంటే ఉద్యోగం, స్వతంత్ర జీవితం, సామాజిక గౌరవం కోల్పోవడమే. అందుకే నిజమైన…

గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిటల్ గా తెలంగాణ

-‍ గేమ్ ఛేంజర్ గా ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ – టెక్నాలజీ డిగ్రీలకే పరిమితం కావొద్దు – దేశ సేవ, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలి – బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణ‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిట‌ల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ…

చిన్న పిల్లల కిడ్నాప‌ర్లు ఇద్ద‌రి అరెస్ట్‌

– ఐదుగురు పిల్లల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు – పోలీసుల అదుపులో పిల్లల్ని కొనుగోలుచేసిన వ్యక్తులు వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: చిన్న పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నిందితులను కాజీపేట్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఘనాపూర్‌ గ్రామానికి చెందిన కొడుపాక నరేష్‌, పెద్దపల్లి టౌన్‌ శాంతినగర్‌కు చెందిన వేల్పుల…

హైవేపై ట్రాఫిక్‌ జాంజాటాలు ఉండవు

Komatireddy Venkat Reddy

– సంక్రాంతికి హ్యాపీగా ఊళ్ల‌కు వెళ్లి రావ‌చ్చు – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్‌…

అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు

– మీ నమ్మకాన్ని వమ్ము చేయడంలేదు – పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 10: రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం అని…

3 హాస్పిటళ్లు.. 30 మెడికల్‌ క్యాంపులు

– మేడారంలో వైద్య సేవల కోసం ఏర్పాటు – జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు – 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు – ఏర్పాట్లపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోద ర్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు…

కిట్స్‌ విద్యార్థులకు రూ.7లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ఈజెన్‌ కంపెనీ మూడు దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు సంవత్సరానికి రూ.7లక్షల (ఎల్‌పీఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని కిట్స్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు వెల్లడిరచారు. సాంకేతిక దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు రాబోయే రోజులలో కిట్స్‌ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధత…

గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోక తప్పదు

– మరోమారు ట్రంప్‌ హెచ్చరిక వాషింగ్టన్‌, జనవరి 10: ఎట్టిపరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. ఆ దేశాలు అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చర్చల…

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రేపు సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, ముచ్చింతల్‌ (హైదరాబాద్‌ చాప్టర్‌) ఆధ్వర్యంలో ఈనెల 11న సంక్రాంతి సంబరాలు, ట్రస్ట్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్‌ భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి,…