Prajatantra News 1

Prajatantra News 1

ఉచిత హామీలను తిరస్కరించాలి!

కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా మార్పుకనిపించడంలేదు. 2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. కాంగ్రెస్‌ కావొచ్చు..బిజెపి కావొచ్చు..తాయిలాలు ప్రకటించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయి. అధికారంలోకి రాగానే తమ స్వలాభమే తప్ప ప్రజల మేలుకోరి పనిచేయడం లేదు. జార్కండ్‌, మహారాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌, బిజెపిలు అధికారం కోసం నానాగడ్డీ కరుస్తున్నాయి. జార్కండ్‌ఎ న్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్కండ్‌ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను ప్రకటించాయి. పదిలక్షలమంది యువతకు ఉపాధి, పదిహేను లక్షల రూపాయలవరకూ ఆరోగ్యబీమా, నాలుగువందల యాభై రూపాయలకే సిలండర్‌, మహిళలకు నెలకు రెండున్నరవేల రూపాయలు, ప్రతివ్యక్తికీ ఏడుకేజీల ఆహారధాన్యాలు, వరి కనీసమద్దతుధరను ఎనిమిది వందల రూపాయలు పెంచడం, వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేక కమిషన్‌, మైనారిటీల హక్కుల పరిరక్షణ ఇందులో ఉన్నాయి. ఈ హామీలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగించివుంటే నమ్మకం ఉండేది. కానీ బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఆదివాసుల వో ట్లకోసం బీజేపీ ఎంతగా కష్టపడుతోంది. ఇటీవలి ఎన్నికల సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది తెలియచెబుతాయి. ప్రధానంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు జార్కండ్‌ మూలమూలల్లోకి చొరబడ్డారని, వారికి దొంగసర్టిఫికేట్లు ఇచ్చి స్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు అతిపెద్ద వోటుబ్యాంకును తయారుచేసుకున్నాయని ఆరోపిస్తూ సెంటిమెంట్‌ ప్రయోగిస్తున్నారు. ఆ చొరబాటుదారులు గిరిజన ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, విద్యాసంస్థలకు మైనారిటీ గుర్తింపుతో ఆదివాసీ విద్యార్థులకు జెఎంఎం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీజేపీ విమర్శలు చేస్తోంది. సంథాల్‌ పరగణాస్‌లో పెద్దసంఖ్యలో అక్రమ చొరబాటుదారులు స్థిరపడ్డారంటూ జార్కండ్‌ హైకోర్టులో ఒక పిల్‌ దాఖలు కావడం, దానిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూండటం ఎన్నికల్లో బిజెపి వాడుకుంటోంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఓ ఐదుసీట్లు ఎక్కువ తెచ్చుకున్న జెఎంఎం, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతీ చిన్న ఎన్నికనూ తీవ్రంగా తీసుకొనే బీజేపీ ఈ మారు జార్కండ్‌ ను స్వాధీనం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోలో, తాను అధికారంలోకి రాగానే 2.87లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతోపాటు, మహిళలకు వివిధ పథకాలద్వారా దండిగానే ఆర్థిక సాయం ప్రకటించింది. పదేళ్ళక్రితం బీజేపీ ఆదివాసీయేతరులను, ప్రధానంగా ఓబీసీలను దగ్గరకు చేర్చుకొని జార్కండ్లో అధికారంలోకి రాగలిగింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా ఉధృతంగా ఉన్నందువల్ల కూడా ఆ ఎత్తుగడ సులువుగా పనిచేసింది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే బిజెపి పాలన ఎలావుందో గత పదేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం కర్ణాటక, తెలంగాణలో ఇష్టారీతిన ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు, ప్రకటించిన పథకాలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేకపోతున్న తీరును ప్రజలు చూస్తున్నారు. మహారాష్ట్ర, జార్కండ్‌ ఎన్నికలకు ముందు ఈ రకమైన హామీలు గుప్పించినా ప్రజలు ఇరుపార్టీలను నమ్మేంతగా పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఏదోరకంగా ఆయా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. చాంతాడంత లిస్టుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరవాత హామేలు అమలు చేయలేక చతికిలపడడం అలవాటు చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ కొత్తగా హామీలు ఇవ్వడానికి వెనకాడడంలేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు అమలుచేయలేని అసహాయతను బయటపెడుతున్నారు. దున్నపోతు మీద వాన పడినట్టు పట్టించుకోనట్టు నటించడం కూడా అలవాటు చేసుకున్నారు. మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించడం మాత్రంమానడంలేదు. బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీ లేదు. ఉచితాల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది. ప్రతీ మహిళకు రూ.2,100 ఇస్తామని జార్కండ్‌ లో చెప్పిన బీజేపీ, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పింది. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై బీజేపీ ఆధారపడ్డట్టు కన్పించింది. ముఖ్యమంత్రి లడ్కీ బచావ్‌ పేరుతో మహిళలకు ప్రతీ నెల రూ.1500 హామీ ఇచ్చి, ఇప్పటికే పాక్షికంగా అమలుచేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ హామీ మామూలే. ఉచితాలు, హామీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటములు కూడా తక్కువేం తినలేదు. ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక అనుభవాలతో కాంగ్రెస్‌ హామీలకన్నా, అధికారమే మిన్న అన్న ధోరణిలో సాగుతోంది. గత హామీల అమలుకు దిక్కు లేకున్నా, కొత్త హామీలు, పథకాలు ప్రకటిస్తే ప్రజలు వోట్లేస్తారులే అన్న ధీమాలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నట్లుగా కనపడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏ విషయంలో విభేదాలున్నా ప్రజలకిచ్చే హామీల విషయంలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలి ఒక్కటే అన్నట్టుగా ఉన్నది. ప్రజల నిజమైన అవసరాలపై వాటికి పట్టింపులేదు. ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలనే బాధ్యత లేదు. అధికారమే పరమావధి అన్నట్టుగా వీరి కార్యాచరణ ఉంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యం కావాలి. మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. అలాగే ఉచిత హామీలను తిరస్కరించాలి. అప్పుడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని గుర్తించాలి. జార్కండ్‌లో ఉత్కంఠపోరు.. గెలిచేదెవరో ...!? జార్కండ్‌ లో ఉన్నవి 81 సీట్లే. అక్కడ రెండువిడతల్లో ఈనెల 13, 20 తేదీల్లో పోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దీంతో ప్రచారహోరు సాగుతోంది. ఆదివాసులను విస్మరించినందునే అధికారాన్ని చేజార్చుకున్నానని బీజేపీ నమ్ముతున్నందున ఈ మారు వారి వోట్లను సైతం అధికంగా కొల్లగొట్టేందుకు విశేషమైన ప్రయత్నం చేస్తోంది. జార్కండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి)ని అమలు చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ దానినుంచి ఆదివాసులను మాత్రం మినహాయించింది. ఇందుకు పూర్తిభిన్నంగా జెఎంఎం ఆదివాసులకు 1932 నాటి ఖతియాన్‌ విధానం ఆధారంగా సర్వమత నియమావళి ని అమలుచేసి ఒక ప్రత్యేక ఆదివాసీ మత గుర్తింపునకు హామీ పడుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఐదు ఎస్టీ రిజర్వుడు సీట్లనూ ఇండియా బ్లాక్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. జెఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఏలుబడిలో అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఆదివాసుల ప్రయోజనాలను పరిరక్షించేది తానేనని బీజేపీ చెబుతోంది. ఇక భూకుంభకోణంలో హేమంత్‌ సొరేన్‌ అరెస్టు, సుప్రీంచొరవతో విడుదల కావడం, హేమంత్‌ భార్య కల్పనా సొరేన్‌ తెరవిరీదకు రావడం ఇత్యాది పరిణామాలు నిజానికి జెఎంఎంకు కొత్తశక్తిని ఇచ్చాయి. మహిళా వోటర్లను ఆమె బలంగా ఆకర్షించగలుగుతున్నదని అంటారు. అయితే, ఓబీసీలు, ఎగువకులాల వోట్లు అధికంగా బీజేపీపక్షాన ఉన్నందున ఇండియా కూటమిని ఆదుకోవాల్సింది ప్రధానంగా రాష్ట్ర జనాభాలో దాదాపు 27శాతంగా ఉన్న ఆదివాసులే. హేమంత్‌ సొరేన్‌ మీద కేసులు, అనంతరం చంపయ్‌ సొరేన్‌ బీజేపీలో చేరడం ఇత్యాది పరిణామాల మీద జార్కండ్‌ వాసులు ఏ తీర్పు ఇచ్చారో నవంబరు 23న తేలుతుంది. వెయిట్‌ అండ్‌ సీ.. -కందుల శ్రీనివాస్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ సెల్‌: 98484 43599

హామీలకన్నా, అధికారమే మిన్న  ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ హామీలు ఉచితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది… కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా  మార్పుకనిపించడంలేదు.  2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు.…

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ

‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెధవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధృడ!   చావవేటికిరా. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు ధిక్కార స్వరాన్ని  వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ నారాయణ…

ట్రబుల్‌ షూటర్‌కు బిజెపి గాలం..?

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి) నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది మొదలు ఈ పదకొండు ఏండ్ల కాలంగా భారతీయ జనతాపార్టీ (బిజెపి) భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)పై నిత్యం దిమ్మెత్తిపోస్తూనే ఉంది. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన పదేళ్ల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై కేవలం బిజెపి రాష్ట్ర నాయకత్వమే కాదు.. సాక్షాత్తు ప్రధాని లాంటివారు కూడా నేటికీ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న విషయం తెలియంది కాదు. కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు బిఆర్‌ఎస్‌కు ఏటిఎంగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించినప్పుడల్లా ఆరోపిస్తూనే వొచ్చారు. అసలు తెలంగాణ విభజనే సరైంది కాదంటూ పలుసార్లు పలు వేదికలపై ఆయన పేర్కొనడాన్నిబట్టి, తెలంగాణపై ఆయన అయిష్టత స్పష్టమైంది. అది మొదలు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడన్న అపవాదను ఆయన మూటకట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బిఆర్‌ఎస్‌, బిజెపితో నేటికీ ఉప్పులో నిప్పుగానే మసలుతున్నది. ఈ క్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీలోని ఓ ముఖ్యనేతపై బిజెపి ప్రశంసలు కురిపించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. బిజెపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును మెచ్చుకోవడం బిఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల్లో అయోమయానికి దారితీసింది. బిఆర్‌ఎస్‌లో క్రెడిబులిటీ ఉన్న నాయకుడు హరీష్‌రావు మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కె.టి. రామారావును ఆయన తీవ్రంగా విమర్శించడం చూస్తే ఆ పార్టీలో విబేధాలు సృష్టించి బలహీనపర్చే యత్నంలో భాగమా అన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ఆయన మీడియా చిట్‌చాట్‌లో కెటిఆర్‌ను అహంకారి అని, అక్రమ సంపాదన వల్లే ఆయనకు అహంకారం పెరిగిందని విమర్శిస్తూనే, హరీష్‌ను బిజెపిలోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు అవునని స్పష్టంగా చెప్పకుండా, ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే నిర్ణయం తానొక్కడిని తీసుకునేదికాదని, పార్టీ వర్గాలందరు కలిసి తీసుకోవాల్సి ఉందంటూ నర్మగర్భంగా చెప్పడం వెనుకున్న అర్థాన్ని వెతుకుంటున్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిపాల్కెనప్పటి నుంచి హరీష్‌ విషయం తరచూ చర్చకు వొస్తూనే ఉంది. ఆయన పార్టీ వీడుతారని, బిజెపిలో చేరుతాడంటూ అనేక వదంతులు వొచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ప్రధాన భూమిక (ఖీ2వ పేజీలో...) పోషిస్తూ వొచ్చిన హరీష్‌రావుకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయన స్నేహపూర్వకంగా ఉంటాడన్న పేరుంది. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌లో ఎప్పుడు ఎలాంటి సంక్షోభం వొచ్చినా ‘ట్రబుల్‌ షూటర్‌’గా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించే నేర్పరిగా ఆయన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. అన్నిటికీ మించి మాస్‌ లీడర్‌గా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుండడంతో ఆయన ఇల్లు ఎప్పుడు చూసినా కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని బిఆర్‌ఎస్‌ పార్టీకి దూరం చేయడానికి బండి సంజయ్‌ వేసిన ఎత్తుగడ అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్‌ను, కెటిఆర్‌ను ఏదో ఒక అంశంవైన విమర్శించే బండి సంజయ్‌ క్రెడిబులిటీ ఉన్న నాయకుడిగా హరీష్‌ను అనాలోచితంగా మెచ్చుకున్నదేమీ కాదు. వ్యూహాత్మకంగానే అని ఉంటారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలాఉంటే బిజెపిలాగా కాంగ్రెస్‌ కూడా హరీష్‌కు గాలం వేసేపనిలో ఉందా అన్న అనుమానానికి ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మాటలు అదే ధోరణిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కెసిఆర్‌ పని అయిపోయిందంటున్న రేవంత్‌రెడ్డి, కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌ చేశామని, ఇక బావతో బావమరిదిని అంటే హరీష్‌రావుతో కెటిఆర్‌ను ఫినిష్‌ చేయనున్నామని, అ తర్వాత హరీష్‌రావును ఎలా మలుచుకోవాలో తమకు తెలుసంటూ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థాన్ని ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. మొత్తానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌రావుకు వీరిద్దరి మాటలు పెద్ద ట్రబుల్‌ల్లోనే పడేసినట్లు కనిపిస్తున్నాయి.

బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ను బలహీనపర్చేందుకా ? క చర్చకు దారితీస్తున్న బండి సంజయ్‌ వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి): నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా…

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?

రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ ‌చెలగాటం.. కొనుగోళ్లపై నిర్లక్షంతో పంటలు బాగా పండినా అమ్ముకోలేని స్థితి మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌రాష్ట్రంలో పంటలను మద్దతు ధరలకు అమ్ముకోలేని స్థితి నెలకొందని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరుతో రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఎక్స్ ‌వేదికగా మండిపడ్డారు. అకాల…

Minister Damodara నిమ్స్‌లో విద్యార్థినులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌ను సందర్శించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ కోలుకున్న విషయం…

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

ఆందోళనకరంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు!

Worrying rapes and atrocities

కఠిన శిక్షలతోనే దుండుగులకు చెక్‌క ప్రజలు అప్రమత్తం కావడమే పరిష్కారం ప్రస్తుతం దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలు, బాలికలపై హత్యాచారాలు, దాడులు, లైంగిక  వేధింపులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి తరవాత మరొకటి అన్నట్లుగా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి.  మృగాళ్లు భయం లేకుండా విచ్చలవిడిగా తెగబడుతున్నారు. బహిరంగంగా ఉరితీసే వరకు ఇవి ఆగవన్న…

అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం వొచ్చేనా..?

America will have a golden age again

అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే చెప్పారు. ట్రంప్‌ మరోమారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో..ఇప్పుడు మనదేశం కోణంలో చూస్తే సంబంధాలు బలంగానే ఉండే అకాశం ఉంది. ట్రంప్‌తో ప్రధాని మోదీకి మధ్య మంచి మితృత్వం ఉన్న కారణంగా ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా…

India Alliance మోదీ ప్రతిష్టకు సవాల్‌గా ఎన్నికలు

India Alliance

మహారాష్ట్రలో బలపడుతున్న ఇండియా కూటమి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల సమరం సాగబోతోంది. ఈ ఎన్నికలలో ఆరు కీలక పార్టీలు తలపడుతున్నాయి. గతంలో శివసేనను చీల్చి దానిని చికాకు పెట్టిన మోదీకి ఇప్పుడు ఈ ఎన్నికలు సవాల్‌ లాంటివే. శివసేనను చీల్చి ఏక్‌నాథ్‌ షిండేను సిఎంగా చేసినా… ఫలితం లేదు.…

Indian job cuts! గుబులు పుట్టిస్తున్న భారతీయుల ఉద్యోగాల కోత!

Indian job cuts

 ఆందోళనకరంగా అంతర్జాతీయ పరిణామాలు దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న వేళ అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారతీయులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తున్న వారికి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ట్విట్టర్‌, మెటా తదితర సంస్థల్లో పరిణామాలతో చాలామంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిరది.  ట్విట్టర్‌ లో ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని మనోళ్లకు కొత్త చిక్కు…